Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో పుచ్చకాయ తింటే... ఆరోగ్యానికి మేలెంతో తెలుసా?

వేసవికాలంలో విరివిగా లభించే పుచ్చకాయ గురించి తెలియని వారుండరు. పుచ్చకాయలో వుండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఈ పండ్ల ముక్కలను రోజూ తీసుకోవడం మరిచిపోరు. అవేంటో చూద్దాం.. పుచ్చకాయలో 95 శాతం నీళ్ళే ఉం

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (11:23 IST)
వేసవికాలంలో విరివిగా లభించే పుచ్చకాయ గురించి తెలియని వారుండరు. పుచ్చకాయలో వుండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఈ పండ్ల ముక్కలను రోజూ తీసుకోవడం మరిచిపోరు. అవేంటో చూద్దాం.. పుచ్చకాయలో 95 శాతం నీళ్ళే ఉంటాయి కాబట్టి.. ఈ వేసవిలో దాహాన్ని తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరానికి చల్లదన్నానిస్తుంది. తక్కువ కెలోరీలు పుచ్చలో వుండటం వల్ల దీన్ని తింటే బరువు సులభంగా తగ్గుతారు. 
  
పుచ్చకాయలో ఎర్రని భాగంలో ఎన్ని పోషకాలు ఉంటాయో దాని వెనుకగల తెల్లని కండ భాగంలో కూడా అంతే పోషాకాలుంటాయి. దీని వెనుకగల కండభాగంలో మామూలుగా కూరలుగా తయారుచేసుకుని తింటే ఆరోగ్యానికి మేలు చేకూరినట్లే. 
 
పుచ్చలో యాంటీ ఆక్సిడెంట్ గానూ, క్యాన్సర్ నిరోధకాలున్నాయి. ఇందులోని లైకోపెన్ అనే రసాయనం మిగతా పళ్లూ, కూరగాయలతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్, రొమ్ము, జీర్ణశయ క్యాన్సర్లతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది. పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
 
ఇందులో అత్యధికంగా ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థకు పనితీరు పెంచి, కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరచడంలో పుచ్చకాయ భేష్‌గా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలను నియంత్రించడంలో పుచ్చకాయ సూపర్‌గా పనిచేస్తుంది. ఇందులోని సిట్రుల్లైన్ రసాయనం యాంటీ-ఏజెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి వేసవిలో పుచ్చకాయను రోజూ తీసుకోవడం మరిచిపోకండి.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments