Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు కొవ్వును కరిగిస్తాయా?

అవును.. నీటికి కొవ్వును కరిగించే శక్తి వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు శరీరంలో క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సాధారణ నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:02 IST)
అవును.. నీటికి కొవ్వును కరిగించే శక్తి వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు శరీరంలో క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సాధారణ నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అందుకే రోజుకు కనీసం రెండుసార్లైనా రెండు గ్లాసుల వేడినీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి హానిచేసే కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే.. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీటిని తాగడం ద్వారా బరువు కూడా తగ్గుతుందని వారు చెప్తున్నారు. 
 
ఇందులో భాగంగా ప్రతిరోజూ లేవగానే కనీసం నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే ఒకేసారి నాలుగు గ్లాసులు ఒకేసారి కష్టం అనుకునేవారు.. తొలుత గ్లాసుతో ప్రారంభించి నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. రోజూ మొత్తంలో పది నుంచి 12 గ్లాసుల నీటిని తాగడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. హైబీపీ దరిచేరదు. కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
 
అలాగే తీసుకునే ఆహారంలో కొవ్వు అధికశాతం లేకుండా చూసుకుంటే బరువు తగ్గుతారు. మైదా, పంచదార, ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న చిరుతిళ్లను మానేయాలి. నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించాలి. గోధుమలతో చేసిన బ్రెడ్‌ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుకోవచ్చు. ఆహార పదార్థాల్లో ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
 
అలాగే తీసుకునే ఆహారంతో పాటు పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మీగడ పాలతో చేసిన పెరుగును ఎంచుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునే వారు మొదటగా స్వీట్లను తినడం మానేయాలి. నూనెను బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments