Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంసాహారం అందుకు పనికిరాదట..?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (11:49 IST)
ఆహారంలో శాకాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాకాహారం తీసుకుంటే అధిక రక్తపోటునుండి కూడా మనిషి తననిన తాను కాపాడుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోపాటు పోషకపదార్థాలుండాలి. 
 
సమపాళ్ళలో తీసుకునే శాకాహారం శరీరానికి అన్నిరకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయటపడగలుగుతామని వైద్యులు చెప్తున్నారు. 
 
మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును నివారించే అమినో ఆమ్లాలుండవు. అదే శాకాహారంలో అమినో ఆమ్లాలు అధికంగా వుంటాయి. ఈ అమినో ఆమ్లాలు రక్తపోటును నివారిస్తాయి. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్తపోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని ఇప్పటికే నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. 
 
ఫైబర్ మనకు ధాన్యాలలో అధికంగా లభిస్తుంది. పప్పులు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్‌లలో అధికంగా లభిస్తుంది. ఇవి శరీర బరువును కూడా క్రమబద్ధీకరిస్తాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం పెరిగిపోతుం. కొవ్వుకూడా అధికంగా పేరుకు పోతుంది. ముఖ్యంగా శరీరానికి కార్బోహైడ్రేట్‌లు కూడా ఎంతో అవసరం. మాంసాహారంలో కార్బోహైడ్రేట్‌లు వుండవు. ఇది బ్రెడ్, రొట్టెలు, అరటిపండు, బంగాళాదుంపల్లో ఎక్కువగా దొరుకుతుంది.  
 
శరీరంలో రక్తం వృద్ధికి మాంసాహారం పనికిరాదు. శరీరంలో రక్త శాతం పెరగాలంటే ఆకుకూరలు, పుదీనా, బెల్లం తదితరాలు తీసుకోవాల్సివుంటుంది. మాంసాహారం నుంచి లభించని బలం పుష్టికరమైన శాఖాహారం నుండి లభిస్తుంది. మాంసాహారం అధికంగా తీసుకుంటే ఆవేశం, ఒత్తిడి తప్పవు. అందుకే శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని.. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments