Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోవచ్చా?... పిల్లలు పుడతారా?

గతకొంతకాలంగా మూత్రవిసర్జన (యూటీఐ) సమస్యలతో బాధపడుతున్నా. కిడ్నీల దగ్గర నుండి యూరేటర్‌ అనే గొట్టాల ద్వారా మూత్రం (యూరిన్‌) మూత్రాశయంలో (యూరినరీ బ్లాడర్‌) చేరి, అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వస్తాయ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (12:47 IST)
గతకొంతకాలంగా మూత్రవిసర్జన (యూటీఐ) సమస్యలతో బాధపడుతున్నా. కిడ్నీల దగ్గర నుండి యూరేటర్‌ అనే గొట్టాల ద్వారా మూత్రం (యూరిన్‌) మూత్రాశయంలో (యూరినరీ బ్లాడర్‌) చేరి, అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వస్తాయి. ఈ సమస్య తరచుగా ఉంది. అందువల్ల ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోవచ్చా? దీనిపై వైద్యులు స్పందిస్తూ... 
 
యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌. కిడ్నీల దగ్గర నుంచి యూరేటర్‌ అనే గొట్టాల ద్వారా మూత్రం (యూరిన్‌) మూత్రాశయంలో (యూరినరీ బ్లాడర్‌) చేరి, అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వస్తాయి. ఆడవారిలో యురెత్రాకి దగ్గరగా యోని, మలద్వారం ఉంటాయి. అక్కడి నుంచి ఇన్‌ఫెక్షన్‌ క్రిములు, యురెత్రా ద్వారా పైకి పాకి ఇన్‌ఫెక్షన్‌కి కారణం కావచ్చు. నీరు సరిగా తాగకపోయినా ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. 
 
ఈ ఇన్‌ఫెక్షన్‌కి, పెళ్లికి, పిల్లలకి సంబంధం లేదు. కాకపోతే తరచుగా యూటీఐ వస్తుంది కాబట్టి, ఎందుకు ఇన్‌ఫెక్షన్‌ మాటిమాటికీ వస్తుంది అని తెలుసుకోవటానికి డాక్టర్‌ని సంప్రదించి సీయూబీ, యూరినల్స్, యూఎస్‌జీ అబ్డామెన్, సీబీపీ, ఎస్‌ఆర్‌ క్రెటైనిన్‌ వంటి పరీక్షలు చేయించుకుని దానికి తగ్గ చికిత్స పూర్తిగా తీసుకోవలసి ఉంటుంది. 
 
ఇన్‌ఫెక్షన్‌ తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేస్తే, అది మెల్లగా కిడ్నీలకి, రక్తంలోకి పాకి కిడ్నీలు పాడవటం, ప్రాణహాని కలిగే ప్రమాదం ఉంటుంది. రక్తహీనత ఉన్నా, షుగర్‌ ఉన్నా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నా, కిడ్నీలో రాళ్లు ఉన్నా కిడ్నీలు, యురేటర్, యూరినరీ బ్లాడర్‌ నిర్మాణంలో సమస్యలు ఉన్నా, పరిశుభ్రత పాటించకపోయినా, నీరు సరిగా తాగకపోయినా తరచుగా ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి వైద్యులను సంప్రదించి తగిన విధంగా చికిత్స చేసుకోవాల్సింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ చేతిలో డబ్బు వుందిగా.. 21 మిలియన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి?: ట్రంప్

మాజీ మంత్రి విడదల రజనీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట- ఏం జరిగిందంటే?

వచ్చే మూడేళ్లలో శ్రీవారి సేవలన్నీ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ చేస్తాం: వెంకయ్య

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం