Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే ఎయిడ్స్‌కు విరుగుడు...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (16:45 IST)
ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌కు విరుగుడు కనిపెట్టారు. మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్) ద్వారా ఎయిడ్స్‌కు చెక్ పెట్టొచ్చని వైద్యులు అంటున్నారు. లండన్‌లో హెచ్‌ఐవీ వైరస్ సోకిన ఓ వ్యక్తికి మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్) ద్వారా ఈ వైరస్ నుంచి ఉపశమనం కలిగినట్లు తాజాగా వైద్యులు వెల్లడించారు. 
 
ఈ పేషెంట్ 18 నెలలుగా అతడు ఎలాంటి హెచ్‌ఐవీ డ్రగ్స్ తీసుకోవడం లేదని, ఆ వైరస్ నుంచి చాలా వరకు ఉపశమనం లభించిందని డాక్టర్లు చెప్పారు. అయితే హెచ్‌ఐవీ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్లే అని చెప్పడం కూడా సరికాదని అంటున్నారు. పైగా హెచ్‌ఐవీ సోకి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తుల్లో ఈ పద్ధతి పాటించడం కూడా ప్రమాదమేనని వారు చెబుతున్నారు. 
 
ఈ లండన్ రోగికి గత 2003లో హెచ్.ఐ.వి. సోకింది. 2012లో కేన్సర్ బారిన పడ్డాడు. కేన్సర్ కోసం కీమోథెరపీ తీసుకున్నాడు. ఆ తర్వాత హెచ్‌ఐవీ వైరస్ నిరోధక శక్తి కలిగిన ఓ దాత నుంచి మూల కణాలను తీసుకొని ఆ పేషెంట్‌లోకి పంపించారు. దీంతో అతనికి కేన్సర్, హెచ్‌ఐవీల నుంచి ఒకేసారి ఉపశమనం లభించడం విశేషం. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు ఈ కేసును అధ్యయనం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments