ఒకసారి లవంగం టీ తాగి చూడండి

సిహెచ్
బుధవారం, 21 మే 2025 (12:51 IST)
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
 
1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 
 
2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 
 
3. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా లేక వాంతులు వచ్చినప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. 
 
4. తేనె, కొన్ని లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
5. లవంగాలు ఏ వంటకంలోనైనా వేసుకోవచ్చు. వంటకాలకు మంచి సువాసన రుచినీ కూడా ఇస్తుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది. 
 
6. తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
 
7. మనం ప్రతి రోజు తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 
 
8. 10 లేక 12 లవంగాలను తీసుకొని వాటికి పసుపు, చక్కెర కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తాగితే శరీరానికి మంచిది. 
 
9. క్రమంతప్పకుండా ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో మాల్దీవుల స్టైల్‌లో సముద్ర తీర ప్రాంతం.. సూర్యలంక, పులికాట్, వైజాగ్ బెల్ట్‌ను..?

అమరావతికి చట్టపరమైన ఆమోదం వుంది.. కొత్త ఎయిర్ పోర్ట్ అవసరం: నారా లోకేష్

జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు?

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments