Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరు తాగిన వారిలో నొప్పులుండవ్.. ఆందోళన ఉండదట.. వేసవిలో తాగడం?

వేసవి కాలం మందు బాబు బీరు బాగా లాగించేస్తుంటారు. ఎండాకాలంలో చల్లిటి బీరుతో గొంతు తడుపుకోవాలనుకుంటారు. ఇందుకు కారణంగా బీరులోని నీటి శాతం ఎక్కువ, ఆల్కహాల్‌ శాతమేమో తక్కువ. కాబట్టి వేసవి తాపాన్ని తీర్చుక

Webdunia
గురువారం, 18 మే 2017 (11:30 IST)
వేసవి కాలం మందు బాబు బీరు బాగా లాగించేస్తుంటారు. ఎండాకాలంలో చల్లిటి బీరుతో గొంతు తడుపుకోవాలనుకుంటారు. ఇందుకు కారణంగా బీరులోని నీటి శాతం ఎక్కువ, ఆల్కహాల్‌ శాతమేమో తక్కువ. కాబట్టి వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బీరుని మించిన దారి లేదని చాలామంది అనుకుంటారు. అయితే ప్రస్తుత బీరులో నీటికంటే ఆల్కహాలు శాతం ఎక్కువుందని తేలింది.
 
బీరులో ఆల్కహాల్ శాతం తక్కువే అయినప్పటికీ, గుండెజబ్బుల వంటి సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎండాకాలం బీర్‌ తీసుకోవడం వల్ల డీహేడ్రేషన్‌ రాదన్నది కూడా ఉత్తుత్తి మాటేనని.. మన శరీరంలో ఏడీహెచ్ అనే హార్మోన్ వుంటుంది. ఈ హోర్మోన్ మనం తీసుకునే నీరు శరీరంలో ఉండేలా చూసుకుంటుంది. అయితే బీరు తాగినప్పుడు ఈ హార్మోన్ దెబ్బతింటుంది. అందుకే బీరును ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక వేసవిలో బీరు జోలికి వెళ్ళకుండా మంచినీటిని, కొబ్బరినీటిని ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. బీరులో నొప్పిని తగ్గించే గుణాలున్నాయని తాజా పరిశోధనలో తేలింది. బీర్ పారసిటమల్ మందు కంటే బాగా పనిచేస్తుందని... నొప్పితో ఉన్నవారిపై జరిపిన పరిశోధనలో.. బీర్ తాగడం ద్వారా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని తేలినట్లు పరిశోధకులు తెలిపారు. బీరు తాగని వారిలో నొప్పి ఏమాత్తం తగ్గకపోగా.. బీరు తాగిన వారిలో నొప్పి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అయితే బీరును మోతాదు మేరకే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

తర్వాతి కథనం
Show comments