Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతు గరగరగా.. మంటగా ఉంటే..?

Webdunia
బుధవారం, 27 జనవరి 2016 (09:20 IST)
సాధారణంగా చలికాలంలో జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికితోడు గొంతు ఇన్‌ఫెక్షన్ కూడా తరచూ వస్తుంటుంది. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో పరిశీలిద్ధాం. 
 
ప్రతి ఒక్క ఇంట్లో పసుపుపొడి తప్పకుండా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తీసుకుంటే సమస్యను త్వరగా దూరం చేస్తాయి.
 
గొంతులో మంట, పట్టేసినట్టు నొప్పి విపరీతంగా బాధిస్తుంటే దాల్చిన చెక్క నూనె చెంచా తీసుకుని అందులో తేనె కలిపి తాగితే తక్షణం ఉపశమనం ఉంటుంది. అవసరమైతే వేడి నీటిలో తేనె వేసుకుని పుక్కిలిస్తే ఎంతో మంచిది. 
 
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పు, కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకుంటే రుచిగా ఉండడమే కాదు గొంతు ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. 
 
ఓ గ్లాసు వేడి నీటిలో దాల్చిన చెక్క, మిరియాల పొడిని ఓ చెంచా కలపాలి. కాసేపైన తర్వాత వడకట్టి పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వల్ల సమస్య నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది. 
 
అరకప్పు వేడి నీటిలో చెంచా శొంఠి పొడి, అర చెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే నొప్పి, మంట అదుపులోకి వస్తాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments