ఈ ఆకు కూర రసం తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి.. (Video)

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:38 IST)
గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి కూర.. ఇలా ఆకు కూరలను ప్రతి వారం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకుకూరల పేరు చెప్పాలంటే ముందుగా తోటకూరను చెపుతారు. తోటకూరను పెరుగుకూర - పెరుగు తోటకూర అనికూడా అంటారు. ఆరోగ్యానికి తోటకూరను మించిన కూర లేదంటే అతిశయోక్తి కాదు.
 
తోటకూర బలవర్థకమైన టానిక్ దీనిలో అనేక ఖనిజ లవణాలు వుంటాయి. అయితే దీనిని వండే విధానం సరిగ్గా తెలియకపోతే తోటకూర ఎంత తిన్నా తోటకూర కాడ లాగే వుండాల్సిందే. తోటకూర ఆకుల్ని తరిగిన తరువాత కడగకూడదు. కాబట్టి తరిగే ముందు ఆకుల్ని బాగా కడిగి ఆ తరువాత తరిగి నీళ్ళు పోసి ఉడకబెట్టాలి.
 
వీలయితే కుక్కర్ వాడటం మంచిది. కుక్కర్‌లో ఉడక పెట్టడం వలన పోషక పదార్థాలు నష్టం కాకుండా వుండటమే కాక తేలికగా జీర్ణం అవుతుంది. తోటకూరను వేళ్ళతో సహా వున్నది తీసుకుని వేళ్ళ దగ్గరి మట్టిని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి మెత్తగా మొత్తం దంచి, పిండి రసం తీయాలి. ఆ తరువాత ఈ రసంలో తగినంత ఉప్పు, రసం పొడి కలిపి బాగా మరిగించి తాలింపు వేసుకుని అన్నంలో కలుపుకొని తినడమో లేక నేరుగా గ్లాసులో పోసుకుని త్రాగడమో చేస్తే తీవ్రమైన మొలలు తగ్గిపోతాయి.
 
అంతేకాదు కడుపులో పురుగులు కూడా ఈ రసం తాగితే పడిపోతాయి. బహిష్ట సమయంలో అధిక రక్తస్రావం అయ్యే స్త్రీలు చాలా నీరసపడి పోతారు. తోటకూరను టి.బి, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులున్న వారు తగ్గిన తరువాత తరుచుగా తోటకూర తీసుకోవడం వలన నీరసం తగ్గుతుంది. తోటకూరలో ముఖ్యమైల ఖనిజం ఐరన్ వుంటుంది. రక్తం వృద్ధి చెందడానికి పనికి వస్తుంది. ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి మంచిది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గద్దర్ మాట: ఒరేయ్ పవన్, అటూఇటూ ఎందుకు తిరుగుతావ్, గద్దరన్న పాట విను, వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ యువ శక్తి ట్రస్ట్

మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అపూర్వ కామెంట్లు... పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments