Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయే సమయాల్లో మన శ‌రీరంలో ఏమేం జరుగుతుందో తెలుసా...?!!

మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైమంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న

Webdunia
సోమవారం, 11 జులై 2016 (15:44 IST)
మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైమంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న శ‌రీరం కూడా త‌న‌లో జ‌రిగే జీవక్రియ‌ల‌కు ఒక్కో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆయా అవ‌య‌వాలు యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. దీనివ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాము. అయితే మ‌న శ‌రీర అవ‌య‌వాలు యాక్టివ్‌గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి మ‌న‌కు అనారోగ్యం క‌లుగుతుంది.
 
* ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్య  స‌మ‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో అది మునిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి. వాకింగ్‌, ర‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు.
* ఉద‌యం 7 నుంచి 9 మ‌ధ్య ప్రోటీన్లు, త‌క్కువ పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారం, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని, పండ్ల‌ను ఈ స‌మ‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీనివ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌య‌మే అందుతాయి.
* ఉద‌యం 9 నుంచి 11 మ‌ధ్య సమ‌యంలో మ‌న శ‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మ‌న శ‌ర‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌ను గాడిలో పెడుతుంది. ఉద‌యం మ‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది.
 
* ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మ‌ధ్య స‌మ‌యంలో మ‌న గుండె ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. శ‌రీర భాగాల‌కు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. దీని వ‌ల్ల శ‌రీర క‌ణాల‌కు శ‌క్తి అందుతుంది.
* మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల స‌మ‌యంలో చిన్నపేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా ప‌నిచేస్తాయి. మ‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి.
* మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల  స‌మ‌యంలో మ‌న మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో ఉంటుంది. ఈ స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి.
* సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌ల  స‌మ‌యంలో మ‌న కిడ్నీలు బాగా చురుగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌బోయ‌డం, వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి.
 
* రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య  స‌మ‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి. మెద‌డు, ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌ను పెరికార్డియం ఈ స‌మ‌యంలో యాక్టివేట్ చేస్తుంది.
* రాత్రి 9 తర్వాత నుంచి 11 గంట‌ల మ‌ధ్య స‌మయంలో భోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. థైరాయిడ్‌, అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. క‌ణాల‌కు శ‌క్తి అందేలా చూస్తాయి.
* రాత్రి 11 నుంచి 1 గంట మ‌ధ్య  స‌మ‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా నొప్పి వ‌స్తుంటుంది.
* రాత్రి 1 నుంచి ఉద‌యం 3 మ‌ధ్య  స‌మ‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ ప‌నిత‌నం దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో ఖచ్చితంగా నిద్ర‌పోవాల్సిందే. లేదంటే కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌వు.
* ఉద‌యం 3 నుంచి 5 మ‌ధ్యలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో ద‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

తర్వాతి కథనం
Show comments