Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో అవసరం (Video)

Webdunia
సోమవారం, 13 జులై 2020 (22:38 IST)
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ముఖ్యంగా బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది. రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి.
 
ఇవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
 
జీడిపప్పు శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
 
ఎండు ద్రాక్ష, ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు వస్తాయి. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
 
ఖర్జూరపు పండ్లలో ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండుసార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments