ఊబకాయంతో కలిగే అనర్థాలు ఇవే... (Video)

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (22:41 IST)
ఊబకాయం... ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరు మన దేశానికి చెందినవారని గణాంకాలు చెపుతున్నాయి. ఈ ఊబకాయం చాలామందిని పీడిస్తున్న సమస్య. మన దేశంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య దాదాపుగా 7 కోట్లు వున్నట్లు తేలింది.
 
ఈ ఊబకాయం కొందరిలో వారసత్వం కారణంగా కూడా వస్తుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హృద్రోగం, టైప్-2, మధుమేహం, కీళ్ళనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. కేలరీలు అధికమోతాదులో ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ చేయక పోవడంతో బరువు పెరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన మందుల వాడకం వల్ల హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. 
 
ఊబకాయ వల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. ఊబకాయంతో బాధపడే వ్యక్తి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అంటే చిన్న వయస్సులోనే దీని బారిన పడితే తక్కువకాలం జీవిస్తారని వైద్యులు చెపుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో సాధారణ పౌరుల ఆరోగ్యం కంటే ఆరింతలు అధికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
 
ముఖ్యంగా, హృద్రోగం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మధుమేహం, నడుంనొప్పి, కీళ్ళలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం, నిద్రలేమి లేదా అధికనిద్ర, పిత్తాశయ వ్యాధులు సోకుతాయి. 
 
ఈ ఊబకాయాన్ని వ్యాయామాలు ద్వారా, ఆహారంలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా కొంతమేరకు తగ్గించుకోవచ్చు. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, చక్కెర, ఉప్పు, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్స్, తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా క్రమం తప్పకుండా చూసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments