పోషకాలు అందించడమే కాదు.. అలసటను - నీరసాన్ని తగ్గంచే కొబ్బరి నీళ్లు.. (వీడియో)

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (11:54 IST)
వేసవి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పండ్లే. ముఖ్యంగా ఈ సీజన్లో మామిడి పండ్లు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. మామిడి తర్వాత అందరికీ గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. తియ్యని, చల్లని కొబ్బరి నీళ్లంటే అందరికీ ఇష్టమే. వేసవిలో ఇవి మరింత ప్రీతికరంగా అనిపిస్తాయి. కొబ్బరినీళ్లు మన దాహాన్ని తీర్చడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
కొబ్బరి నీళ్లు అలసటను, నీరసాన్ని తగ్గిస్తాయి. వీటిని తాగడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. అలాంటి కొబ్బరి నీళ్లలో కార్బొహైడ్రేడ్లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లాంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లోపం ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగితే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. 
 
కండరాలు సవ్యంగా పనిచేసేందుకు పొటాషియం అవసరం. కాల్షియం విషయానికొస్తే.. మనలో చాలా మంది శరీరానికి అవసరమైన కాల్షియం తీసుకోవడం లేదు. దీని వల్ల ఎముకలు బలహీనమవుతాయి. కొబ్బరి నీటిలో అధిక స్థాయిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మన ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో ప్రొటీన్లు తయారు కావాలన్నా, రక్తపోటు స్థాయులు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలన్నా.. కండరాలు, నరాలు చక్కగా పనిచేయాలన్నా కూడా మెగ్నీషియం చాలా అవసరం అనే చెప్పాలి. ఖనిజ లోపం ఉన్నవారికి కొబ్బరి నీళ్లు ఔషధం లాంటిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కొబ్బరి నీటిలో అధిక స్థాయిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం మన ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో ప్రొటీన్లు తయారు కావాలన్నా, రక్తపోటు స్థాయులు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలన్నా.. కండరాలు, నరాలు చక్కగా పనిచేయాలన్నా కూడా మెగ్నీషియం చాలా అవసరం అనే చెప్పాలి. ఖనిజ లోపం ఉన్నవారికి కొబ్బరి నీళ్లు ఔషధం లాంటిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

తర్వాతి కథనం
Show comments