Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే..?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (12:00 IST)
వేసవిలో ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. జీన్స్‌ లాంటి మందంగా, బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం మానేయాలి.


ఎండలో వెళ్లిన ప్రతిసారీ తలకు టోపీ తప్పనిసరి. హెల్మెట్‌ పెట్టుకునే వాళ్లు ముందు నీళ్లతో తడిపిన రుమాలు తలకు, ముఖానికి కట్టుకుని తర్వాత హెల్మెట్‌ పెట్టుకోవాలి. ఎండలో పనిచేసేవాళ్లు గంటకు లీటరు చొప్పున నీరు తాగాలి. ఇంటిపట్టున ఉండేవారు రోజుకి 4 లీటర్ల నీరు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
నీరు ఉండే పుచ్చ, ద్రాక్ష, దోసకాయలను తినాలి. చెమట ద్వారా కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేయడం కోసం ఎలకా్ట్రల్‌, కొబ్బరి నీరు తాగాలి. ఉప్పు, పంచదార కలిపిన నీరు కూడా మేలు చేస్తుంది. ఎండలో ఎక్కువ సమయం ప్రయాణం చేయవలసివస్తే రెండు గంటలకోసారి ఆగి, నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలి.
 
ఇంకా వేడి వాతావరణానికి గురైనా ఎండదెబ్బ తగులుతుంది. వంటగదిలో పొయ్యి దగ్గర ఎక్కువ సమయం గడిపే స్త్రీ‌లు, కొలిమి దగ్గర పనిచేసేవాళ్లు, రేకుల ఇంట్లో నివసించేవాళ్లు, వేడి గాలికి గురయ్యేవాళ్లకు కూడా ఎండ దెబ్బ తగులుతుంది. అలాగే విపరీతంగా వ్యాయామం చేసేవాళ్లు కూడా వేసవిలో ఎండదెబ్బకు గురవుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments