Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మినుములు, పెసలు, బియ్యంతో ఫేస్ ప్యాక్ ఇలా?

వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే మినుములు, పెసలు, బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మినుములు, పెసళ్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా శరీర ఉష్ణాన్ని తగ్గిస్త

Webdunia
మంగళవారం, 13 మార్చి 2018 (15:37 IST)
వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే మినుములు, పెసలు, బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మినుములు, పెసళ్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా శరీర ఉష్ణాన్ని తగ్గిస్తాయి. పెసళ్లలో ఇనుము, ధాతువులు పుష్కలంగా వుంటాయి. అలాగే బియ్యం కూడా శరీర వేడిని తగ్గిస్తాయి. ఈ మూడింటిని సమపాళ్లు తీసుకుని పౌడర్‌లా తయారు చేసి.. ముఖానికి, చర్మానికి రోజు మార్చి రోజు ప్యాక్‌లా వేసుకుంటే చర్మంపై మొటిమలు మాయమవుతాయి. అలాగే చెమటకాయలు దూరమవుతాయి. 
 
అలాగే బియ్యంతో చేసిన జావ వేసవిలో శరీర వేడిని తగ్గిస్తుంది. బియ్యం ఒక కప్పు, బెల్లం అర కప్పు, పెసలు పావు కప్పు, ఏలకులు రెండు, పాలు గ్లాసుడు తీసుకుని జావగా ఎలా చేయాలో చూద్దాం. బియ్యాన్ని కడాయిలో వేయించుకుని.. రవ్వలా మిక్సీలో కొట్టి పక్కనబెట్టుకోవాలి. 
 
ఓ పాత్రలో బెల్లాన్ని తీసుకుని నీటిని చేర్చి కరిగించాలి. అందులో ఉడికించిన పెసలు పప్పు, రవ్వలా చేసుకున్న బియ్యం చేర్చాలి. యాలకులు కూడా చేర్చాలి. బియ్యం ఉడికేంత వరు వుంచి దించేయాలి. ఈ గంజిని వేసవిలో రోజూ తీసుకుంటే.. వేడి తగ్గిపోతుంది. పిల్లలు, పెద్దలకు ఈ గంజి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments