Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ బాదములతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (20:55 IST)
ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్‌ 21వ తేదీన జరుపుకోవడం ద్వారా సంపూర్ణమైన జీవనశైలిని అనుసరించాల్సిన ఆవశ్యకత పట్ల అవగాహన మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో యోగా అభ్యాస ప్రయోజనాలనూ తెలుసుకుంటున్నాం. అతి పురాతనమైన వ్యాయామ ప్రక్రియ యోగా. భారతదేశంలో పుట్టిన యోగా, శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సుకు తోడ్పడుతుంది.
 
గత కొద్ది  సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వివిధ దేశాలలో అమితోత్సాహంతో, సామూహిక ప్రదర్శనలతో జరుపుకుంటున్నారు. అయితే, ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి ఎంతో మంది జీవితాలను సమూలంగా మార్చింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, ఈ సంవత్సరం నేపథ్యాన్ని ‘ఇంటి వద్దనే యోగా, కుటుంబంతో యోగాగా నిర్ణయించారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా కుటుంబాలు తమ రోజువారీ జీవితాలలో యోగాను జోడించుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన, విశ్రాంత జీవనశైలి ప్రాముఖ్యతనూ తెలుపుతున్నారు.
 
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ, యోగాను అభ్యసించడం ద్వారా ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉండేందుకు అత్యుత్తమ మార్గం అనుసరించడంతో పాటుగా అందుకు తగినట్లుగా అతి ముఖ్యమైన ఆరోగ్య , పౌష్టికాహార డైట్‌నూ తీసుకుందాం. కుటుంబాలు తమ సమగ్రమైన ఆరోగ్య ప్రయాణాన్ని చిన్నవే అయినప్పటికీ  ప్రభావవంతమైన రీతిలో ప్రతి కుటుంబ సభ్యుని ఆరోగ్య, రోజువారీ రొటీన్‌లో భాగం చేసుకోవాల్సి ఉంది.
 
ఓ గుప్పెడు బాదములను తమ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడం అందులో తొలి అడుగు. పౌష్టికాహార స్నాకింగ్‌ అవకాశంగా మాత్రమే అవి నిలువడంతో పాటుగా వాటిని తరచుగా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహ నియంత్రణ, బరువు నియంత్రణ, చర్మ ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటుగా రోగ నిరోధక వ్యవస్థనూ ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాల్సిన ఆవశ్యకత గురించి సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘యోగాను అభ్యసించడాన్ని నేను అమితంగా ఇష్టపడతాను. శాస్త్రం, ఆధ్యాత్మికతల సమ్మేళనమిది. కానీ, ఈ వినూత్నమైన సమ్మేళనం చేరుకోవడానికి అత్యంత కీలకమైనఅంశాలలో ఒకటిగా ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు నిలుస్తాయి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, పౌష్టికాహార భోజనం వంటివి నాకెప్పుడూ కూడా ప్రాధాన్యతాంశాలే. మా కుటుంబ సభ్యులు కూడా అదే అనుసరించాలని నేను కోరుకుంటుంటాను.
 
నేను ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను తీసుకోవడంతో ఆరంభిస్తుంటాను. ఇవి పోషకాల గనిగా ఉండటమే కాదు అవసరమైన శక్తినీ అందిస్తాయి. వీటితో పాటుగా బాదములలో రాగి, జింక్‌, ఫోలెట్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తికి తోడ్పాటునందించడం వల్ల నా డైట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థంగా మారింది’’ అని అన్నారు.
 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ఎంతోకాలంగా, అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యాయామ శైలిగా యోగా కీర్తిగడించింది. ఇప్పుడు ప్రతి రోజూ మనం నూతన  వైవిధ్యాలు లేదా సమ్మేళనాలను గురించి వింటూనే ఉన్నాం. వీటిని కూడా ప్రజలు అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. టైప్‌ 2 మధుమేహంతో ఇబ్బందిపడే ఎంతోమంది తమ రోజువారీ వ్యాయామంలో భాగంగా యోగాను చేసుకుంటే ప్రయోజనం పొందగలరు. ఇది గ్లైసెమిక్‌ నియంత్రణకు తోడ్పడంతో పాటుగా సమస్యలను కూడా నియంత్రిస్తుంది. కానీ ఈ వ్యాయామాలతో పాటుగా పౌష్టికాహార భోజన ప్రణాళిక కూడా ఉంటే అది మరింతగా ప్రభావం చూపుతుంది.
 
తాజా పళ్లు, కూరగాయలు, బాదములు లాంటి నట్స్‌ను మీ డైట్‌లో జోడించుకోవడానికి ప్రయత్నించండి. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములలో ప్రోటీన్‌ అధికంగా ఉండటంతో పాటుగా డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన బ్లడ్‌ షుగర్‌ స్థాయి నిర్వహించడంలో  సహాయపడటంతో పాటుగా టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న ప్రజలలో బ్లడ్‌ షుగర్‌ నియంత్రణకూ తోడ్పడుతుంది. అదే సమయంలో సాధారణంగా ఫాస్టింగ్‌ ఇన్సులిన్‌ స్థాయిపై ప్రభావం చూపే కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌పై బ్లడ్‌ షుగర్‌ ప్రభావాన్ని సైతం తగ్గిస్తాయి..’’అని అన్నారు.
 
బుద్ధిపూర్వక స్నాకింగ్‌తో యోగా సాధన చేయాల్సిన అవసరాన్ని గురించి ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌ మరియు సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఫిట్‌గా ఉండటం  అతి ముఖ్యమైనభాగం. యోగాసనాలను అభ్యసించడం, బ్రీతింగ్‌ వ్యాయామాలను ప్రతి రోజూ చేయడమనేది రోజూవారీ వ్యాయామాలకు అత్యుత్తమ జోడింపు.
 
కానీ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, యోగా మరియు ఫిట్‌నెస్‌ కార్యక్రమానికి బుద్ధిపూర్వక, పౌష్టికాహార జోడింపు చేసుకోవడం మంచిది. బాదములలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. మజిల్‌మాస్‌ వృద్ధి, నిర్వహణకు తోడ్పడే పోషకం ఇది. వర్కవుట్‌కు ముందు, తరువాత తినేందుకు అద్భుతమైన స్నాక్‌గా బాదం నిలుస్తుంది. వీటితో పాటుగా ఆకలిని తీర్చే వీటి గుణం కారణంగా భోజనాల నడుమ తీసుకునే స్నాక్‌గా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోనూ తోడ్పడుతుంది’’ అని అన్నారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన, ఆరోగ్య వంతమైన జీవనశైలికి ప్రతిజ్ఞ చేయండి. దానిలో యోగా, ఆరోగ్యం మిళితం చేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments