Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు నిద్రించేటప్పుడు లో దుస్తులు ధరించవచ్చా?

మహిళలు నిద్రించేటప్పుడు నైటీలను ధరించడం చేస్తారు. అయితే లో దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిద్రించేటప్పుడు బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించి నిద్రించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నార

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:19 IST)
మహిళలు నిద్రించేటప్పుడు నైటీలను ధరించడం చేస్తారు. అయితే లో దుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ నిద్రించేటప్పుడు బిగుతుగా ఉండే లో దుస్తులను ధరించి నిద్రించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట లోదుస్తులు ధరించకుండా నిద్రించడం మంచిది.

ఇంకా నిద్రకు ఉపక్రమించేందుకు ముందు మహిళలు ఏం చేయాలంటే..? ఉదయం పూట వేసుకున్న మేకప్‌ను తొలగించాలి. హెయిర్ స్టైల్ తొలగించాలి. జుట్టును వదులుగా వదిలేయాలి. ముఖానికి కొబ్బరినూనెను పూతలో వేసుకోవాలి. కాంటాక్ట్ లెన్స్ వాడే వారైతే.. లెన్స్‌ను తొలగించి నిద్రించడం ఉత్తమం.

చాలామటుకు ఆభరణాలు ధరించడం కూడదు. నగలను తొలగించడం మంచిది. నిద్రించేందుకు ముందు సెల్ ఫోన్లను పక్కనే ఉంచడం కూడదు. కాస్త దూరంగా వాటిని పెట్టడం మంచిది. లేదా స్విచ్ఛాప్ చేయాలి. లేకుంటే సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా నిద్రలేమి తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. 
 
గర్భిణీ మహిళలైతే సాయంత్రం రాత్రి పూట అధికంగా నీరు లేదా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా రాత్రి పూట బాత్రూమ్‌ల వెంట నడిచే పని తప్పుతుంది. దీంతో నిద్రకు భంగం కలుగదు. అయితే మితంగా నీటిని తీసుకోవాలి. పగటి పూట ఎక్కువ నీటిని తీసుకోవాలి. ఇక రాత్రిపూట లోదుస్తులను తొలగించి నైటీలతో నిద్రించడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు.
 
బిగుతుగా వుండే దుస్తులను ధరించడం ద్వారా చర్మ సమస్యలు తప్పవని అందుకే వాటిని తొలగించి నిద్రించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెమట ద్వారా బ్యాక్టీరియాలు చర్మాన్ని కమలిపోయేలా చేస్తాయని.. తద్వారా దురద వంటి ఇతరత్రా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు ముందు స్నానం చేసి.. తడి లేకుండా మాయిశ్చరైజర్ క్రీములను చర్మానికి వాడటం మంచిదని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments