Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటళ్లలో బిర్యానీ తింటున్నారా? కుళ్ళిపోయిన మాంసం వాడుతున్నారట.. జ్యూస్‌ల్లోనూ అదే తీరు..!

ఇంట్లో బిర్యానీ వద్దని.. టేస్టుగా ఉంటుందని హోటల్ బిర్యానీ అంటేనే లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఇక మీ పని అయిపోయినట్టే. మొన్నటికి మొన్న హోటళ్లలో క్యాట్ బిర్యానీ, డాగ్ బిర్యానీ అమ్ముతున్నారంటూ వార్తల

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (14:44 IST)
ఇంట్లో బిర్యానీ వద్దని.. టేస్టుగా ఉంటుందని హోటల్ బిర్యానీ అంటేనే లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఇక మీ పని అయిపోయినట్టే. మొన్నటికి మొన్న హోటళ్లలో క్యాట్ బిర్యానీ, డాగ్ బిర్యానీ అమ్ముతున్నారంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో... కస్టమర్లకు కుళ్ళిన మాంసాహారాన్ని, సీ ఫుడ్స్‌ను హోటల్స్ సర్వ్ చేస్తున్నాయని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని శానిటరీ విభాగం తెలిపింది. వారం రోజుల పాటు జరిపిన సోదాల్లో ఇలా కుళ్ళిపోయిన మీట్, సీఫుడ్స్‌తో 15 పాపులర్ రెస్టారెంట్లు భోజనాన్ని సర్వ్ చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ హోటళ్లు సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు.  
 
కొన్ని జ్యూస్ సెంటర్లు కూడా పాడై పోయిన పండ్లను చౌక ధరలకు కొని వాటినే రసం తీసి వినియోగదారులకు అందిస్తున్నారని వారు చెప్పారు. ఇలాంటి జ్యూస్ సెంటర్లు, కుళ్ళిన ఫుడ్ సర్వ్ చేస్తున్న హోటళ్ళు, రెస్టారెంట్లు 10 రోజుల్లోగా తమ తీరు మార్చుకుని శుభ్రమైన ఆహారాన్ని సప్లై చేయకపోతే వాటిని సీల్ చేయడమే గాక లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు.
 
అలాగే సికింద్రాబాద్ బోర్డు పరిధిలో 500కు పైగా రెస్టారెంట్లు, హోటళ్ళపై వీరు ఆకస్మిక దాడులు జరగగా, వీటిలో చాలా హోటళ్ళు 10 రోజులుగా నిల్వ ఉంచిన చికెన్, మటన్, రొయ్యలు, చేపలను వండి వినియోగదారులకు అందిస్తున్నట్టు శానిటరీ అధికారులు చెప్పారు. డీప్ ఫ్రీజ్ చేయకుండా సాధారణ ఫ్రిజ్‌లలో ఈ ఆహారాన్ని ఉంచుతున్నారని, దీంతో ఫంగస్ సోకుతుంది. అయినప్పటికీ వాటిని వండి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారని అధికారులు చెప్పుకొచ్చారు. 
 
ఈ క్రమంలో తిరుమలగిరి, మారేడ్ పల్లి వంటి చోట్ల గల పెద్ద రెస్టారెంట్లు కూడా ఇలా పాడై, కుళ్ళిపోయిన ఫుడ్‌ని అందిస్తున్నాయని అధికారులు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫ్రిజ్ ఓపెన్ చేయగానే దుర్వాసనతో రూమంతా నిండిపోయిందని, కుళ్ళిన ఫుడ్‌ని పారవేయించామని తెలిపారు. ఇక్కడి షాహీ బిర్యానీ దర్బార్ అనే ఫేమస్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా బిర్యానీకోసం వాడిన మటన్ లో ఫంగస్ ఉన్నట్టు తెలిసింది. ఈ హోటల్ యజమాని బల్క్‌లో తక్కువధరకు మటన్ కొని 10 రోజులపాటు నిల్వ ఉంచి దాన్నే బిర్యానీ తయారీకోసం వాడుతున్నాడని తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

తర్వాతి కథనం
Show comments