Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబీలు- మల్లెలు సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా..

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (22:15 IST)
సౌందర్యాన్నిచ్చే పూలలో చాలామటుకు ఔషధ గుణాలను కూడా కలిగి వుంటాయి. కొన్ని పూలు సువాసనలు వెదజల్లితే మరికొన్ని సౌందర్య పోషణలో నిలుస్తుంటాయి. అటువంటి వాటిలో రోజాపూలు ముందువరసలో వుంటాయి. ఐతే ఈ గులాబీలు సౌందర్యాన్ని పెంచడంతో పాటు ఔషధాలలోనూ ఉపయోగిస్తుంటారు.
 
గులాబీపూలు మనిషి మూడ్‌ను మార్చే శక్తిని కలిగి వుంటాయి. ఎంతో విచారంలో ఉన్న వారికి గులాబీలు అందించినట్లయితే వారి మనసులో విచారం పోయి ఆనందం మొదలవుతుంది. గులాబీల నుండి తీసిన రసాయనాలు మానవ కాలేయం, పిత్తాశయాల పనితీరును మెరుగుపరుస్తాయి.
 
ఇక మల్లెపూవుల విషయానికి వస్తే ఇవి ఘాటైన సువాసనలనిస్తుంటాయి. ఇవి అలంకరణకే కాదు ప్రేమికులు మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాదు జుట్టు కూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
 
ఇంకా కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాకుండా మాడుకు చల్లదనాన్నిస్తుంది. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్‌ చొప్పున కలిపి ప్యాక్‌ వేసుకుని ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపాకు జయమంగళ రాజీనామా.. పెద్దకర్మ పోస్ట్.. బాబుకు పవన్ గౌరవం ఇస్తారా?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

వాయనాడ్‌‌లో ప్రియాంక గాంధీ ఘనవిజయం.. రాహుల్ రికార్డ్ బ్రేక్

'మహాయుతి' అదుర్స్.. మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

తర్వాతి కథనం
Show comments