Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముల్లంగి కూర తింటే ఎంత మేలో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:47 IST)
Radish Gravy
అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు ముల్లంగి కూర తింటే మేలు జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని నీటిలో నానబెట్టి గుజ్జులా చేసుకుని చర్మ సమస్యలున్న ప్రాంతంలో రాస్తే అవి తగ్గిపోతాయి. అవే గింజల్ని పొడిచేసి నీళ్లలో కలిపి రాత్రి తాగితే కడుపులో పురుగులు, క్రిముల వంటివి చనిపోతాయి.
 
ముల్లంగి గింజల్ని బాగా నూరి ఫేస్‌ మాస్క్‌లా రాసుకొని గంట తర్వాత నీటితో కడుక్కుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు, చారల వంటివి తొలగిపోతాయి. విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి తాగితే… మూత్ర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.
 
అలాగే ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు… భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే… ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని… రోజుకు మూడు సార్లు తింటే చాలు. మలబద్ధకం, మొలలు, కామెర్ల వంటి సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments