గుమ్మడి గింజలను పారేస్తున్నారా?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (15:32 IST)
గుమ్మడి కాయను మనం వంటకాల్లో ఉపయోగిస్తాం కానీ గుమ్మడి గింజలను పారేస్తుంటాం. అయితే వాటి వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
 
గుమ్మడిలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీఆక్సిడెంట్స్, జింక్, మరియు మెగ్నీషియం మొత్తం శరీర ఆరోగ్యనికి మేలు చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. 
 
గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు, కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
 
గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి. ఎటువంటి క్యాన్సర్ అయినా సరే గుమ్మడి గింజలు నివారిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్‌లను నివారించగలిగే రోగనిరోధక శక్తిని ఇవి కలిగి ఉంటాయి. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.
 
డయాబెటీస్ రాకుండా నివారించేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
 
గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
 
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులు మరియు బాధలు నుండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా విముక్తి పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments