Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు వాడే టూత్ పేస్ట్ గురించి ఒక్కసారైనా ఆలోచించారా?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (08:43 IST)
ముఖానికి నవ్వు అందాన్నిస్తుంది. ఆ నవ్వుకు దంతాలు మరింత అందాన్నిస్తాయి. దంతాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమంటున్నారు దంతవైద్య నిపుణులు. దేశంలోని ప్రజలు దాదాపు 51 శాతం మాత్రమే టూత్ పేస్టు, టూత్ బ్రష్‌ను వాడుతున్నారంటే నమ్ముతారా... అందులోనే భారతదేశంలో నివసించే చాలామంది జనాభాల్లో దంతాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం దంతాలపై అవగాహన లేకపోవడమేనంటున్నారు వైద్యులు. 
 
దేశంలోని కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే ఉదయం, రాత్రి రెండు పూటలా దంతావధానం చేస్తున్నట్లు ఓ సర్వేలో తెలిసింది. అలగా పంటి నొప్పి కలిగినప్పుడు దేశంలోని 82 శాతం మంది ప్రజలు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అదే వందమందిలో కేవలం ముగ్గురు మాత్రమే నిత్యం ప్రతి ఏడాదికి ఒకసారి తమ దంత పరీక్షల కొరకు వైద్యుల వద్దకు వెళుతుంటారని ఆ సర్వే ఫలితాలు వెలువరించింది.
 
టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్:
 
దంతావధానం చేసేందుకు టూత్ పౌడర్ లేదా టూత్ పేస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకదానితోనే బ్రష్ చేయగలుగుతారు. దీంతో దంతావధానం సరిగా చేయగలుగుతారు. ఒకవేళ మీరు టూత్ పౌడర్‌ను వినియోగించాలనుకుంటే ఆ పౌడర్ నున్నగా ఉండేలా చూసుకోండి. 
 
మీరు వాడే టూత్ పేస్ట్ ఎలా ఉండాలంటే...
 
ఏదైనా మంచి కంపెనీ లేదా మంచి బ్రాండ్ కలిగిన టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి.
టూత్ పేస్ట్ రంగు, రుచి, సువాసనకు బదులుగా దాని పనితనమెంటో తెలుసుకోండి. 
ఆహారం లేదా నీరు తీసుకునే సమయంలో మీ దంతాలకు చల్లగా-వేడిగా అనిపిస్తే మెడికేటెడ్ టూత్ పేస్ట్‌ను ఉపయోగించండి. 
ఫ్లోరైడ్‌తో కూడుకున్న టూత్ పేస్ట్‌ను వాడాలనుకుంటే వైద్యుల సలహా మేరకు వాడుకోవాలి.
 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments