పొటాటో జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ రాదట..

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (16:59 IST)
దుంపకూరల్లో బంగాళాదుంపకు ప్రత్యేక స్థానం ఉంది. దీనితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. వివిధ రకాల చిప్స్‌ను తయారు చేసుకుని ఆరగిస్తుంటాం. అయితే కేవలం వంటలతోనే కాకుండా, ఆలూ జ్యూస్‌తో కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బంగాళాదుంపల జ్యూస్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. 
 
ఆలుగడ్డల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలకు సపోర్ట్‌ ఇస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరా మెరుగుపడేలా చేస్తుంది. ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ జ్యూస్‌ తాగితే కీళ్ల నొప్పులు పోతాయి. బంగాళాదుంపల జ్యూస్‌తో మైగ్రేన్‌‌ను దూరం చేసుకోవచ్చు. స్థూలకాయం ఉన్న వారు ఈ జ్యూస్‌ తాగితే బరువు తగ్గుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
పొటాటో జ్యూస్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే, జీర్ణాశయం, పేగుల్లో ఏర్పడే అల్సర్లను నివారిస్తుంది. ఈ జ్యూస్‌లో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆలుగడ్డల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం ఐరన్‌ను గ్రహించేలా చేస్తుంది. రక్తహీనత సమస్య పోతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు పోతాయి. బి విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. జుట్టుకు పోషణ లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనంతపురం హాస్టల్‌లో 19ఏళ్ల డిగ్రీ విద్యార్థిని అనుమానస్పద మృతి

మూడేళ్లలో ఆ మహిలపై 600 మంది అత్యాచారం చేశారు...

ఇంకెంత కాలం ఆంధ్రోళ్లు కారణం అంటారు, దేశంలో అంతా అలా అనుకుంటే?: పవన్ కల్యాణ్

నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఎవరి జాగీరూ కాదు.. పవన్ వార్నింగ్ (video)

అనుమతి ఇవ్వకున్నా ధర్నా చేస్తాం.. కావాలంటే అరెస్టు చేసుకోండి : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అపూర్వ కామెంట్లు... పిలిచినప్పుడు వెళ్లకపోతే ఏం చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments