Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్‌ వ్యాధికి శాశ్వత పరిష్కారం...? ఎలాగంటే...

మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మళ్ళీ మళ్ళీ మందు బిళ్ళలు. ఇన్సులిన్ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్ పెట్టేస్తే మానవ జాతికి ఇంత కన్నా మహాభాగ్యం మరొకటి ఉండదు. ఆ మహాభాగ్యాన్ని త్వ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (11:06 IST)
మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మళ్ళీ మళ్ళీ మందు బిళ్ళలు. ఇన్సులిన్ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్ పెట్టేస్తే మానవ జాతికి ఇంత కన్నా మహాభాగ్యం మరొకటి ఉండదు. ఆ మహాభాగ్యాన్ని త్వరలో మన భాగ్యనగరి కల్పించబోతోంది. ఇక్కడి వైద్యులు ఎండోస్కోపీ చికిత్సా విధానంతో మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలోకి తేవచ్చని గుర్తించారు. ఈ విధానాన్ని ఏడుగురు రోగులపై పరిశీలించగా అది విజయమైంది కూడా.
 
దీంతో మరింతమంది మధుమేహులకు ఈ చికిత్సను అందించి వారిలో వచ్చే ఫలితాలను ఆధారం చేసుకుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధానం వినియోగంలోకి వస్తే భవిష్యత్తులో మధుమేహ బాధితులు మందులు, ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ సందర్భంగా హెచ్‌ఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎండోస్కోపీ మధుమేహాన్ని నియంత్రణలో పెట్టేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉందని, త్వరలో ఈ విధానం చికిత్స అందించనున్నారు.
 
హైదరాబాద్‌లో 3 నెలల క్రితం ఏడుగురు రోగులకు ఎండోస్కోపీతో మధుమేహాన్ని నియంత్రించనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 200 మందికి ఈ విధానం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో పెట్టినట్లు చెప్పారు. క్లోమంలో ఇన్సులిన్ హెచ్చు తగ్గుల వల్లే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉండదని భావించడం సరికాదని మీడియాతో చెప్పారు నాగేశ్వర్ రెడ్డి. చిన్న పేగుల్లోని ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుందని, దానిలో మార్పులు చేసే డయాబెటిస్‌ను అదుపులో పెట్టవచ్చునన్నారు. ఎండోస్కోపీతో చిన్న పేగుల్లో ఇన్సులిన్‌ను ఎక్కువ, తక్కువ చేయొచ్చన్నారు. చిన్నపేగుల్లో మ్యూకోజ్‌ను 80డిగ్రీల వద్ద కాల్చడం వల్ల ఇన్సులిన్ తగిన మోతాదులో చిన్నపేగును ఒక పొరతో కవర్ చేస్తామన్నారు. తద్వారా క్లోమంలో ఇన్సులిన్ క్రమబద్దీకరించవచ్చని పరిశోధనలో తేలిందన్నారు. 
 
మొబైల్ వ్యాన్‌తో శిబిరాలు, ఆధునిక చికిత్స విధానాలను గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నామని, ముఖ్యమంత్రితో మాట్లాడి గ్రామాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. మొదటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్‌ జీఐ ఎండోస్కోపీ కార్యక్రమానికి 20 దేశాల నుంచి వైద్య నిపుణులు వచ్చారని ఇందులో ఎండోస్కోపీ విధానంలోఉన్న ఆధునిక చికిత్సా విధానాలపై చర్చించనున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments