Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు ఈ కాయలు తింటే...

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:17 IST)
చిక్కుడు కాయల్లో వుండే కాపర్ మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్.... వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇవి శరీరంలోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతుంది. ఫలితంగా చిక్కుడు కాయలు వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని తేలింది.

 
సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషధంలా పని చేస్తుంది.

 
నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక  ఆందోళనను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లోని పొటాషియం కండరాల వృద్దికి, పని తీరుకి తోడ్పడుతుంది. అంటే మనకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నమాట.

 
చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి. చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి.

 
చిక్కుడు కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments