Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణాళికలు వేసుకుని తింటున్నా లావైపోతూ వుంటే కారణాలు ఇవే...

శరీరం లావుగా మారిపోయి వికారంగా తయారయినప్పుడు పదిమందిలో చాలా ఇబ్బందిగా వుంటుంది. ఆకారంపై కామెంట్లు చేస్తుంటే భరించలేని బాధ కలుగుతుంది. ఐతే ప్రణాళికలు వేసుకుని క్యాలరీలు తగ్గించుకుని తింటున్నా లావవుతుంటే కారణాలు ఏమిటో తెలుసుకోవాల్సిందే.

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (22:32 IST)
శరీరం లావుగా మారిపోయి వికారంగా తయారయినప్పుడు పదిమందిలో చాలా ఇబ్బందిగా వుంటుంది. ఆకారంపై కామెంట్లు చేస్తుంటే భరించలేని బాధ కలుగుతుంది. ఐతే ప్రణాళికలు వేసుకుని క్యాలరీలు తగ్గించుకుని తింటున్నా లావవుతుంటే కారణాలు ఏమిటో తెలుసుకోవాల్సిందే.
 
తగినంత నిద్రలేకపోవడం...
ఎన్నోసార్లు మనం కొద్దిపాటి నిద్రతో సరిపెట్టుకుంటుంటాం. కానీ,తగినంత నిద్రలేకపోతే మన శరీరం మానసిక ఒత్తిడికి గురవుతుంది. దాని ఫలితంగా అధిక శాతంలో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. అప్పుడు మనకి కావలసినదానికన్నా ఎక్కువ కేలరీలు చేరి బరువు పెరిగిపోతుంది. తగినంత నిద్రలేకపోవడం, విశ్రాంతిలేకపోవడం వల్ల అలసట,నీరసం కలుగుతాయి. మీరు మీ బరువుని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎప్పుడూ తగినంత సమయం నిద్రపోవాలి.
 
ఒత్తిడి
మానసిక ఒత్తిడి ఎక్కువకాలం కొనసాగితో మన శరీరంలో రసాయన ప్రక్రియ జరిగి జీర్ణక్రియ మందగిస్తుంది. దీనికి అర్ధం, మీరు రోజూ కేవలం మీకు కావలసిన కేలరీల మీదే దృష్టి సారిస్తే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే జీర్ణక్రియ మందగించకుండా శ్రద్ధ తీసుకోవాలి. అన్నిటికన్నా మించి ఒత్తిడి వల్ల ముఖ్యంగా నడుముచుట్టూ బరువు పెరుగుతుంది. కాబట్టి, మీ నడుము భాగంలో కొవ్వు పెరిగితే గనుక మీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి.
 
మందుల ప్రభావం
కొన్ని మందులు అంటే, ఒత్తిడి, తలనొప్పి, రక్తపోటు, అలాగే హార్మోన్ల రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకున్నవారు కూడా వాడే మందులవల్ల బరువు పెరగడం జరుగుతుంది. ఈ మందులు ఆకలిని పెంచి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల్నిపెంచుతుంది. ఒక్కోసారి బరువు పెరగడానికి ఏ మందు కారణమో ఖచ్చితంగా కనుక్కోవడం కష్టమౌతుంది. ఎందుకంటే శరీరం మీద ఒక్కో మందు ఒక్కో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సందర్భంలో డాక్టర్‌ని సంప్రదించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments