Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఐతే ఆరెంజ్ జ్యూస్ తాగండి

కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఐతే ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరెంజ్ జ్యూస్‌ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే మూత్రపిండాల వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే మూత్రపి

Webdunia
శనివారం, 16 జులై 2016 (12:45 IST)
కిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా? ఐతే ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరెంజ్ జ్యూస్‌ని ప్రతి రోజు క్రమం తప్పకుండా త్రాగితే మూత్రపిండాల వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే  మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వారు సూచిస్తున్నారు. 
 
ఆరెంజ్‌లో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటం సులువవుతుంది. ఆరెంజ్‌లో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ ఖనిజం గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఆరెంజ్‌లో పోలిఫెనోల్స్ సమృద్దిగా ఉండుట వలన వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
 
అలాగే ఆరెంజ్ పండ్లను తినడం ద్వారా కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిసింది. ఆరెంజ్‌లో ఉండే కెరోటినాయిడ్ అని పిలిచే విటమిన్ ఏ కాంపౌండ్స్ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆరెంజ్‌లో లిమోనాయిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ, ఊపిరితిత్తుల, రొమ్ము, కడుపు, ప్రేగు క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ రకాల మీద పోరాటానికి సహాయపడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments