Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూప్ తాగితే బరువు తగ్గుతారా?

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (09:41 IST)
బరువు తగ్గడానికి ఆహారం తినడం మానేయడం, డైటింగ్ చేయడం వంటివి చాలా మంది చేస్తుంటారు. అలా కడుపుమాడ్చకోనవసరం లేదు. మంచి పౌష్టికాహారం తీసుకుని హాయిగా బరువు తగ్గించుకోవచ్చు. ఊబయకాయం నుండి నాజూగ్గా తయారవ్వాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం ముఖ్యం. అటువంటి ఆరోగ్య సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
మనలో చాలా మందికి సూప్ త్రాగే అలవాటుంది. స్థూలకాయం ఉన్న ప్రతి ఒక్కరు సూప్ త్రాగడానికి అలవాటు పడితే మంచిది. ప్రతి రోజు భోజనం చేసే ముందు సూప్ తాగితే సంవత్సరంలో మీరు పెరిగే బరువులో 7 కేజీల బరువు తగ్గిపోతారట. ప్రతి ఒక్కరు సూప్ త్రాగడం అలవాటు చేసుకుంటే స్థూలాకాయం నుండి దూరం కావచ్చు. టమోటో లాంటి వెజిటబుల్ సూప్ త్రాగితే చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. 
 
ఆరోగ్య సూత్రాలు పాటించే వారు మొదట చేసేది ఆయిల్ తగ్గించడం. ఆలివ్ ఆయిల్ అలవాటు చేసి సాదారణంగా ఉపయోగించే ఆయిల్‌ను దూరం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచింది. ఆలివ్ ఆయిల్లో మ్యూఫా చాలా ఉంటాయి. మ్యూఫా అంటే మోనో శాచ్యురేటడ్ ఫ్యాట్ అని అర్థం. ఇవి శరీరంలోని మంచి కోలెస్ట్రా‌ల్‌ను తగ్గించకుండా చెడు కొలెస్ట్రా‌ల్‌ను తగ్గిస్తాయి. ఈ విధంగా గుండె జబ్బులు దూరం అవుతాయి. గుండె పదిలంగా ఉంచుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments