Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్ తింటుంటారు... వాటిలో ఏమున్నాయో తెలుసా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (21:11 IST)
ప్రస్తుత కాలంలో చాలామంది ఉదయం అల్పాహారానికి బదులుగా ఓట్స్‌ని చేర్చుకుంటున్నారు. ఇవి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటంతో పాటు ఎంతో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవటం వలన కలిగే ప్రయోజనమేమిటో చూద్దాం.
 
1. తృణధాన్యాల గింజలు అయిన వోట్స్‌లో ప్రోటీన్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి.  
 
2. ఓట్స్‌లో సమృద్ధిగా ఉండే యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేయటానికి మరియు అథెరోస్క్లెరోసిస్ దోహదపడే ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును తగ్గిస్తుంది. వోట్స్‌లో ఉండే లిగ్నన్ గుండె జబ్బులను నివారించడానికి సహాయ పడుతుంది. 
 
3. ఓట్స్ అల్పాహారం అదనపు పౌండ్లు కోల్పోవటానికి మరియు ఒక ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి ఎంతో బాగుంటుంది. దీనిలో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉండుట వలన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. 
 
4. క్రమం తప్పకుండా ఓట్స్‌ను ఆహారంలో తీసుకోవటం వలన ఆందోళన మరియు ఒత్తిడి నుండి దూరంగా ఉండవచ్చు. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మెదడు, మానసిక స్థితి, నిద్ర మరియు ఆకలిని నియంత్రించే ఒక న్యూరోట్రాన్స్మిటర్‌ని ప్రేరేపిస్తుంది. అదనంగా, మెగ్నీషియం ఉండుట వలన నిద్ర నాణ్యత పెరిగి విశ్రాంతికి సహాయపడుతుంది.  
 
5. వోట్మీల్ తినటం వలన మీ చర్మం మృదువుగా మరియు తేమగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది అన్ని రకాల చర్మాల వారికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఎక్స్ ఫ్లోట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. వోట్మీల్ ఒక సహజ క్లీన్సర్ వలె పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments