Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యకరమైన ఆహారానికి చక్కనైన యాప్

హెల్తీ ఫుడ్‌కి యాప్ అనగానే మనకిష్టమైన ఆహారం ధర గురించి తెలిపే యాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది పూర్తిగా భిన్నమైన మెను. మనం ఇష్టపడే తిండి ధర గురించి చెప్పదు కానీ మనం తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో చెబుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ర

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (07:08 IST)
హెల్తీ ఫుడ్‌కి యాప్ అనగానే మనకిష్టమైన ఆహారం ధర గురించి తెలిపే యాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది పూర్తిగా భిన్నమైన మెను. మనం ఇష్టపడే తిండి ధర గురించి చెప్పదు కానీ మనం తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో చెబుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండునెలల్లో ఈ యాప్‌ని ప్రారంభించనుంది.
 
భారతీయ ఆహార రకాలకు సంబంధించిన భారీ డేటాబేస్ నుంచి ఈ యాప్ డేటాను గణిస్తుంది. దేశమంతటినుంచి సేకరించిన 526 ఆహార రకాల నమూనాల్లోని 150 అంశాలకు సంబంధించి పోషకాహార సమాచారాన్ని ఈ డేటాబేస్ అందిస్తుంది.  తాము ఏం తింటున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలని భావించే వారికి ఇది చాలా కీలకమైనదని సంస్థ డైరెక్టర్ లోంగావ్ తెలిపారు. మన పోషకాహార విధానాలను తీర్చిదిద్దడంలో కూడా ఇది తోడ్పడుతుందన్నారు. 
 
ఆహార రకాలకు సంబంధించిన తొలి డేటాబేస్‌ని 1937లో తొలిసారి ప్రచురించగా చివరి డేటాబేస్‌ను 1989లో ప్రచురించారు. ఇప్పుడు పాత డేటాబేస్‌ల కంటే ఎంతో విస్తృతమైన డేటాబేస్‌ని రూపొందిస్తున్నామని ఇది మరింత వివరణాత్మకంగా ఉంటుందన లోంగావ్ పేర్కొన్నారు. 
 
ఈ డేటాబేస్‌లో తొలిసారిగా అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ గురించిన వివరాలు పొందుపరుస్తున్నారు. ఇంగ్లీషుతో పాటు భారతీయ భాషలన్నింటిలో ఆహార సూచికను ఇది కలిగి ఉంటుంది. భారతీయ ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, రిబోప్లోవిన్, నియాసిన్ వంటి పోషకపదార్థాలను ఈ డేటాబేస్ విశ్లేషిస్తుంది.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా?

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments