Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆకు శరీరంలోని విషాన్ని పీల్చేస్తుంది... ఇంకా... (video)

Webdunia
గురువారం, 19 మే 2022 (23:07 IST)
అడవి ప్రాంతాలలో నేరేడు పండ్లు విరగగాసేవి. మొదట్లో వీటిని పిచ్చికాయలుగా భావించి జనం తీసుకునేవారు కాదట. అయితే ఇందులో ఎంతో ఔషధ గుణాలున్నాయని తెలుసుకుని, అపర సంజీవనిలా ఇది పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి జనం వీటిని మందులాగా వాడుతున్నారు.

 
పూర్వకాలంలో ఏదైనా విష పురుగులు శరీరంలో ఎక్కడైనా కుట్టినట్లయితే... వెంటనే నేరేడు ఆకులను ఆ ప్రాంతంలో వేసి కట్టుకట్టేవారు. శరీరంలో ప్రవేశించిన విషం ప్రభావం మెల్లిగా నేరేడు ఆకులకు చేరి తెల్లవారేసరికి రోగి లేచి కూర్చునేవాడట. అంటే మన శరీరంలో విషాన్ని కూడా పీల్చేసే శక్తివంతమైన ఆకులు కలిగివున్న నేరేడు చెట్టు... తన కాయల ద్వారా కూడా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించడం విశేషం. 

 
నేరేడు గింజల్లో జంబోలిన్‌ అనే గ్లూకోసైట్‌ పదార్థం ఉంది. ఇది మన శరీరంలో ఉండే స్టార్చ్‌ను చక్కెరగా మారుస్తుంది. అది ఉత్పత్తి చేసే చక్కెర షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక రకంగా మన శరీరానికి కావలసిన ఇన్సులిన్‌ను ప్రకృతిసిద్ధంగా ఇది మనకు అందిస్తోంది. 

 
అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండానే వెంట్రుకలు మన కడుపులోకి పంపించేస్తుంటాం. అయితే ఆ వెంట్రుకలు కడుపులో చుట్టుకుపోయి అప్పుడప్పుడు ఇబ్బందిని కలిగిస్తుంటాయి. నేరేడు పండ్లు ఆ వెంట్రుకలను బయటకు పంపించేస్తాయట. అందుకే నేరేడు పండ్లు విరివిగా దొరికే సీజల్‌లో అయినా నేరేడు పండ్లను తినాలి. సంవత్సరానికి ఒక్కసారైనా నేరేడు పండ్లను తినాలని పెద్దలు చెబుతుంటారు.


 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments