Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ళ నొప్పులకు దివ్యౌషధంగా పనిచేసే ఆయిల్స్ ఇవే..

వయస్సు పెరిగే కొద్దీ ప్రతియొక్కరిని వేధించే సమస్య కీళ్ళ నొప్పులు. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకు పోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వల్లగానీ, ఏవైనా క్రిముల వల్ల ఇన్‌ఫెక్షన్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:29 IST)
వయస్సు పెరిగే కొద్దీ ప్రతియొక్కరిని వేధించే సమస్య కీళ్ళ నొప్పులు. ఎముకలు గట్టిపడి అవి కీళ్ళు బిగదీసుకు పోవడానికి కారణమవుతుంటాయి. ఏదో విధంగా కీళ్ళకు దెబ్బ తగలడం వల్లగానీ, ఏవైనా క్రిముల వల్ల ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్లగానీ కీళ్ళ వ్యాధి రాగల అవకాశముంది. ఈ నొప్పులు వచ్చే ముందు.. కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కీళ్ళు నొప్పి ఉన్న ప్రాంతంలో కందిపోయినట్లుగా కనిపించడం, వాచినట్లుగా ఉండి, వేడిగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ నొప్పులతో బాధపడే వారు నీరసం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరంలాంటి లక్షణాలతో బాధపడుతుంటారు. 
 
ఇలాంటి నొప్పులు ఉన్నవారు.. కీళ్ళ మీద ఆవనూనెను ప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా కాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే కూడా నొప్పులు తగ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌లో కొడాలి నాని పేరు.. అరెస్ట్ తప్పదా?

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

తర్వాతి కథనం
Show comments