Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు తిని విడిచిపెట్టిన బిర్యానీని ఇంకొకరికి వడ్డిస్తే ఎలా వుంటుంది?

నల్లగొండ జిల్లాలోని హోటళ్లలో కుళ్లిన చికెన్, పాచిపోయిన బిర్యానీ వడ్డిస్తున్నారట. ఈ విషయాన్ని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ వెల్లడించారు. రెండో రోజుల క్రితం హోటళ్లపై జరిపిన ఆకస్మిక తనిఖీలో రెస్

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (10:58 IST)
నల్లగొండ జిల్లాలోని హోటళ్లలో కుళ్లిన చికెన్, పాచిపోయిన బిర్యానీ వడ్డిస్తున్నారట. ఈ విషయాన్ని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ వెల్లడించారు. రెండో రోజుల క్రితం హోటళ్లపై జరిపిన ఆకస్మిక తనిఖీలో రెస్టారెంట్‌లో ఉన్న పాచిపోయిన బిర్యానీ, ఫ్రిజ్‌లో ఉంచిన నిల్వ ఉన్న చికెన్‌, మటన్‌ పీస్‌లను చెత్త ట్రాక్టర్‌కు ఎక్కించారు.
 
మునిసిపల్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టేవరకు ఆహార కల్తీ నిరోధక శాఖాధికారులు స్పందించక పోవటం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంతో హోటల్ నిర్వాహకులు ఆడుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు మూడు రోజులుగా నిల్వ చేసిన పదార్థాలను వడ్డిస్తున్నారు. నాన్‌వెజ్‌లో ఉపయోగించిన నూనెతోనే వెజిటేరియన్‌ కూరగాయలకు వాడుతున్నట్లు తెలుస్తోంది.
 
నల్లగొండ మునిసిపాలిటీలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పనిచేస్తున్న ఓ ఉద్యోగి పట్టణంలో పేరొందిన ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. రెస్టారెంట్లో బిర్యానీ తిన్న మరుసటి రోజు నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమంగా తయారు కావటంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో సదరు రోగిని పరిశీలించిన వైద్యులు కలుషితమైన ఆహారం భుజించటంవల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని తేల్చి చెప్పారు.
 
నల్లగొండ బస్టాండుకు ఎదురుగా ఉన్న బావర్చి హోటల్‌లో పాచిపోయిన బిర్యానీ, కుళ్లిపోయిన చికెన్‌‌ను అధికారులు కనుగొన్నారు. మూడు రోజులుగా నిల్వ చేసిన చికెన్‌కు మసాలాలు దట్టించి వేడి చేసి ప్రజలకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేగాకుండా ఒకరు తిని విడిచిపెట్టిన బిర్యానీని సైతం వదిలి పెట్టకుండా కొత్త బిర్యానీలో కలుపుతున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments