Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైగ్రెయిన్‌కు ధ్యానానికి మించిన మందు లేదు!

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (16:17 IST)
సాధారణంగా చాలా మంది మైగ్రెయిన్‌తో బాధపడుతుంటారు. ఇది ఓ పట్టాన తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా మైగ్రెయిన్‌తో బాధపడేవారి సంఖ్య కోటాను కోట్లుగా ఉంది. ఒక్క అమెరికాలోనే నాలుగు కోట్ల మందికిపైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అనేక సర్వేలు చెపుతున్నాయి. దాంతో అక్కడ అనేకమంది పరిశోధకులు దీని నివారణకు ప్రత్యామ్నాయ వైద్యాలమీద దృష్టిని సారించి విజయం సాధించారు. 
 
ఇందులోభాగంగానే ఇటీవల అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ మైగ్రెయిన్‌పై ఓ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా తలనొప్పి, మైగ్రెయిన్‌లను తగ్గించేందుకు యోగా, ధ్యానం రెండింటి కలయికతో ఓ ప్రత్యేక పద్ధతిని రూపొందించారు. ఆపై మైగ్రెయిన్ తీవ్రతను బట్టి బాధితులను విభిన్న వర్గాలుగా విభజించి వాళ్లతో నెలరోజులపాటు ఆ ప్రత్యేక యోగాని చేయించగా ఆ వ్యాధి తీవ్రత చాలావరకూ తగ్గిందట. 
 
పైగా వారానికి మూడుసార్లు వచ్చేవాళ్లకు ఒకసారి రావడం జరిగిందట. దీన్నిబట్టి మైగ్రెయిన్‌కు ఇతరత్రా మందులకన్నా ధ్యానంతో కూడిన యోగా ఎంతో మేలు అని ఈ పరిశోధకులు చెపుతున్నారు. సో... మైగ్రెయిన్ బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పూట ఓ అర్థగంట పాటు ధ్యానం చేయడం వల్ల ఆ నొప్పినుంచి విముక్తులు కావ్చొచ్చన్నమాట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments