Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన యువకులు భార్య వండిపెట్టే కమ్మని వంటను తెగ లాగిస్తున్నారు.. దీంతో ఏమౌతుందంటే?

పెళ్లికి ముందు.. అమ్మ చేతివంట, ఫాస్ట్ ఫుడ్ తిని తిని విసిగిపోయిన యువకులు పెళ్లై పిల్లలు పుట్టిన కొంత కాలం వరకూ బరువు పెరిగిపోతున్నారని తాజా పరిశోధనలో తేలింది. పెళ్లికాని యువకులు ఇంటి భోజనాన్ని పెద్దగా

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (15:11 IST)
పెళ్లికి ముందు.. అమ్మ చేతివంట, ఫాస్ట్ ఫుడ్ తిని తిని విసిగిపోయిన యువకులు పెళ్లై పిల్లలు పుట్టిన కొంత కాలం వరకూ బరువు పెరిగిపోతున్నారని తాజా పరిశోధనలో తేలింది. పెళ్లికాని యువకులు ఇంటి భోజనాన్ని పెద్దగా పట్టించుకోకుండా తిరుగుతారు. కానీ పెళ్లైన వారు మాత్రం భార్య వండిపెట్టే కమ్మని వంటకాలను తెగ లాగించేస్తారు. అందుకే వారు పెళ్లైన కొత్తల్లో లావుగా మారిపోతారు.
 
దీనిపై జరిగిన పరిశోధనలో పెళ్లైన యువకులతో పాటు అదే వయసు ఉండి ఇంకా పెళ్లి చేసుకోని యువ‌కులకు మధ్య బాడీ మాస్ ఇండెక్స్‌ను చూశామ‌ని పరిశోధకులు తెలిపారు. వారి మధ్య బాడీ మాస్ ఇండెక్స్ సగటున 1.4 కేజీల వరకూ తేడా ఉందన్నారు. 
 
తద్వారా భార్య చేతి వంట తిని పెళ్లైన యువకులు పిల్లలు పుట్టేంత వరకు బరువు పెరుగుతున్నారని బ్రిటన్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బాత్ నివేదికలో వెల్లడైంది. స‌న్నగా ఉన్న‌వారు కాస్త బ‌రువు పెరిగినా ఫ‌ర్వాలేదు కానీ, అలాగే బ‌రువు పెరుగుతూ వెళ్లిపోతే వాటితో పాటు అనారోగ్యం కూడా వ‌స్తుంద‌ని తెలిపింది. కాలేయ సంబంధిత రోగాలతో ఇలాంటి వారికి తిప్పలు తప్పవని.. అందుచేత ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు వెళ్ళడం, వాకింగ్ చేయడం వంటివి పాటిస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చునని పరిశోధకులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments