నోట్లో చెడు రుచి అనిపిస్తే కారణమేంటి, ఈ సమస్య కావచ్చు...

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (23:08 IST)
చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది. అందువల్ల మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి. దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.
 
కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం మరియు ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం మరియు వాంతులు వస్తాయి. ఇది రక్తంలో వ్యర్థాల ఫలితంగా జరుగుతుంది. ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది. కిడ్నీలు ఎరిత్రోపయోటిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. అవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది.
 
అలసట మరియు మెదడుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.
 
ఈ నొప్పితో పాటు కీడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

తర్వాతి కథనం
Show comments