బరువు తగ్గాలంటే.. జాగింగ్ చేయడం ఎంతో బెటర్

Webdunia
గురువారం, 23 మే 2019 (14:28 IST)
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, ఫిట్‌గా ఉండేందుకు చాలా మంది జిమ్‌లకు వెళతారు, బరువులు ఎత్తి మరీ వ్యాయామం చేస్తారు. ఇలా చేయడం కంటే జాగింగ్ చేయడం ఎంతో ఉత్తమం అని డాక్టర్లు చెబుతున్నారు. జిమ్‌కు వెళ్లలేని వారు జాగింగ్‌కి వెళితే మంచి ప్రయోజనం ఉంటుంది. కొంత మంది ఉదయం పూట జాగింగ్‌కి వెళితే మరికొంత మంది సాయంత్రం పూట జాగింగ్‌కి వెళతారు. 
 
అయితే ఎప్పుడు జాగింగ్‌కి వెళితే మరింత ప్రయోజనం ఉంటుందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. దీనిపై కాలిఫోర్నియా, ఇజ్రాయిల్ యూనివర్శిటీల పరిశోధకులు రీసెర్చ్ చేసారు. దీని కోసం ఎలుకలను వాడుకున్నారు. ఉదయం కంటే సాయంత్రం జాగింగ్‌కి వెళితే మేలని తేల్చారు. ప్రయోగంలో భాగంగా ఎలుకలను ట్రెడ్‌మిల్‌పై కూర్చోబెట్టి వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఎక్సర్‌సైజ్‌లు చేయించారు. 
 
ఆ తర్వాత వీటి చురకుదనాన్ని పరీక్షించారు. ఉదయం జాగింగ్ చేసిన వాటికంటే సాయంత్రం జాగింగ్ చేసిన ఎలుకలు 50శాతం ఎక్కువ ఉత్సాహంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విధానం మనుషులకు కూడా వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
సాయంత్రం సమయంలో జాగింగ్ వంటి ఎక్సర్‌సైజులు చేస్తే మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. ఉదయం జాగింగ్ చేసే సమయం లేకపోతే మానివేయకుండా సాయంత్రం సమయాన్ని కేటాయించి జాగింగ్ చేయండి. అప్పుడు ఉత్సాహం, ఫిట్‌నెస్ మీ స్వంతం అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హర్మూజ్‌లో వెళ్లాలనుకుంటే పేలిపోతారు.. లారక్ దీవి మీదుగా వెళ్లాలి.. ఇరాన్

కాకతీయ వైద్య కాలేజీలో ర్యాంగింగ్ కలకలం.. విద్యార్థులపై కఠిన చర్యలు

అయ్యా డీఎస్పీగారూ... నన్ను ఎన్‌కౌంటర్ చేసేయండి: మంగళగిరిలో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

తాడిపత్రిలో వ్యవసాయ వ్యర్థాలను ఆర్థిక అవకాశాలుగా మలిచిన అల్ట్రాటెక్ ప్రాజెక్ట్ ఉదయ్

వరంగల్‌: యువతిపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి చంపేశారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం వేసిన హీరోయిన్ హన్సిక

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ లాంఛ్

లవ్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బేబమ్మ రోల్.. ప్రదీప్ రంగనాథన్ స్వీట్ పర్సన్

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం సిద్ధం

Poorna: పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన డార్క్ నైట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !

తర్వాతి కథనం
Show comments