నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

ఠాగూర్
సోమవారం, 7 జులై 2025 (17:07 IST)
యేడాదికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో వచ్చే పండ్లలో నేరేడు పళ్లు ఒకటి. ఈ పళ్ల సీజన్ ఇపుడు వచ్చింది. నల్లగా నిగనిగలాడుతూ చూడగానే తినేయాలనిపించే ఈ పళ్ల వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ పళ్లలో అనేక పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి.

యేడాదిలో ఒక్కసారైనా వీటిని ఆరగించాలని మన పెద్దలు చెబుతుంటారు. అలాంటి పళ్లను ఆరగించడం కలిగే ప్రయోనాలేంటో ఓ సారి చూద్దాం.

నేరేడు పళ్లలోని జాంబోలిన్, జాంబోసిన్ అనే ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ఈ పళ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

నేరేడు పళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి. నేరేడు పళ్లలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. వీటిలోని పొటాషియం, కాల్షియంలు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నేరేడు పళ్లలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

అలాగే మాడు మీద ఇన్ఫెక్షన్లను తగ్గించి, శిరోజాల పెరుగుదలకు సహాయపడతాయి. వీటిలోని విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు. మచ్చలు, గాయాలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తాయి.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments