Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటి పిల్లలకు మంచి ఔషధంగా పని చేసే బెల్లం

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (11:29 IST)
పిల్లల ఎదుగుదలకు ఐరన్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌ వంటి ఖనిజాలు చాలా అవసరం. ఈ పోషకాలన్నీ బెల్లంలో పుష్కలంగా లభిస్తాయి. అలాగే రోజువారీ ఆహారంలో భాగంగా బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా అవ్వడంతోపాటు ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి.
 
బెల్లం ఆహారపదార్థాలకు రుచినివ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా పిల్లలకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలోని పోషకాల వల్ల పిల్లల్లో రక్తహీనత, జీర్ణ సంబంధ సమస్యలు దూరంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్‌ అధికంగా లభిస్తుంది. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గిపోకుండా ఉంటుంది. అలాగే బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. 
 
బెల్లాన్ని రోజువారీ తీసుకోవడం వల్ల పిల్లల ఎదుగుదలకు, ఎముకల బలానికి కావలసిన క్యాల్షియం, ఫాస్పరస్‌ వంటి పోషకాలు ఎక్కువగా అందుతుంది. అంతేకాదు బెల్లంలో వ్యాధినిరోధక శక్తికి తోడ్పడే యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, జింక్‌ వంటి న్యూట్రిషన్స్‌ కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల పిల్లల్లో ఫ్లూ, జలుబు వంటి వాటిని తగ్గించడానికి కూడా బెల్లం ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా మితంగా తింటేనే ఔషధం. అందుకే బెల్లం తీసుకుంటే మంచిది కదా అని ఎక్కువగా తినకూడదు. అందుకని పిల్లలకు రోజూ ఆహారంలో కొద్ది పరిమాణంలో ప్రతిరోజూ పెట్టాలి.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments