Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాలు పడుతున్నాయి, గోరువెచ్చని నీళ్లు తాగితే...

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (22:02 IST)
వానా కాలం వచ్చింది అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడినీళ్లు తాగిన వెంటనే మన శరీరంలో ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కొందరిలో చెమటలు పడతాయి. ఆ చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటకు వెళ్లి శరీరం శుద్ధి జరుగుతుంది.
 
బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఎంత ఉపశమనం కలిగిస్తుందో మీరే గమనించవచ్చు.
 
నరాలు, కండరాలు కూడా చురుకుగా పనిచేసేందుకు వేడినీళ్లు ఉపయోగపడతాయి. నరాలు చురుకుగా ఉండడం వల్ల మన ఆలోచనలు చురుకుగా ఉంటాయి. అంటే వేడినీళ్లు తాగడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతుంది.
 
ఫిల్టర్ నుంచి పట్టిన నీళ్లను స్టౌ మీద తగినంతగా వేడిచేసుకొని తాగాలి. వర్షాకాలంలో ఇబ్బందిపెట్టే జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బందిపడేవారు గోరువెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. దీనిద్వారా శ్వాస సక్రమంగా ఆడుతుంది. వేడినీళ్లలో ఒక చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని తాగితే మరింత ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments