Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీచు పదార్థం అధికంగా ఉన్న ఆహార పదార్థాలు.. కడుపునొప్పి..?

పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. అయితే ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్థాలతో నిండిన ఆహారంగా ఉండాలి. మంచి ఆహారం తీసుకోకపోవడం

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:14 IST)
పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. అయితే ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్థాలతో నిండిన ఆహారంగా ఉండాలి. మంచి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, పీచు పదార్థం లేకపోవడం వంటి కారణాల వలన మలబద్ధకం సమస్య వస్తుంది.
 
అందుకోసం మందులు వాడి అనారోగ్య సమస్యలతో బాధపడడం ఏమాత్రం మంచిది కాదు. పండ్లు, కూరగాయలు, బీన్స్, ధాన్యాలు వంటి వాటిల్లో పీచు పదార్థం అధిక మోతాదులో ఉంటుంది. పండ్లపై గల తొక్కభాగంలో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. ఆపిల్ పండు తొక్కను తీయకుండా అలానే తీసుకుంటే మంచిది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలలో పీచు పదార్థమే కాకుండా శరీరానికి కావలసిన మెగ్నిషియం కూడా లభిస్తుంది. 
 
నీటిని అధికంగా తీసుకోవాలి. లేదంటే కడుపులో వ్యర్థాలు బయటకు రాకుండా కడుపునొప్పితో పాటు మలబద్ధకానికి కూడా దారితీస్తుంది. పండ్ల ముక్కల్ని నీళ్ళల్లో కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందుగా గ్లాస్ వేడిపాలు తాగితో జీర్ణాశయం శుభ్రపడుతుంది. భోజనం చేసిన తరువాత పీచు పదార్థం తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమై మలబద్ధకం సమస్య తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments