Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమ్మీద అత్యంత విలువైన ఆహారం ఎక్కడో లేదు. మన ఇంట్లోనే ఉందట.. లాగించేయండి మరి!

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలీదు కానీ ఒక గుడ్డు. ఒకే ఒక గుడ్డు. సంపూర్ణ ఆరోగ్యానికి వందశాతం గ్యారంటీ అంటున్నారు వైద్యులు. ఒక్క మదుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రమే కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటున్నారు మరి.

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (03:16 IST)
ఏదయితే మంచి ఆహారమో.. ఏవయితే శరీరానికి నిజమైన పోషక విలువలను అందిస్తాయో.. వాటిని విడిచి జంక్ ఫుడ్‌ను తినడంలో మనల్ని మించినోళ్లు లేరని ప్రతీతి. మనం పిజ్జాలు తినాల్సిన పనిలేదు. బిర్యానీలకోసం పరుగెత్తాల్సిన పనిలేదు. కేఎప్‌సీల జోలికి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలీదు కానీ ఒక గుడ్డు. ఒకే ఒక గుడ్డు. సంపూర్ణ ఆరోగ్యానికి వందశాతం గ్యారంటీ అంటున్నారు వైద్యులు. ఒక్క మదుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రమే కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటున్నారు మరి. 
 
భూమ్మీద అత్యంత విలువైన ఆహారం అంటే గుడ్డే అంటున్నారు. చాలా ఏళ్ల నుంచి ఇది మన ఆహారంలో అంతర్భాగం. పైగా ఇది సంపూర్ణ పోషకాహారం కూడా. వేలకొద్దీ పోషక ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి దీన్ని భూమిపైనే అత్యంత విలువైన ఆహారంగా చెబుతారు. అయితే గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంత మంది భావిస్తారు.
 
అయితే అది కేవలం అపోహ మాత్రమే. అందులో ఏమాత్రం నిజం లేదు. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉన్నప్పటికీ దీని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవని ఓ పరిశోధనలో తేలింది. ఒకవేళ టైప్-2 మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యలుంటే తప్ప దీని వల్ల ఎలాంటి ముప్పు లేదని పరిశోధకులు.
 
కొవ్వు అనేది కొన్ని అహార పదార్థాల్లో ఉండే మైనం లాంటి పదార్థం, అలాగే ఇది కాలేయం నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది కణాల పనితీరు, డి విటమిన్, హార్మోన్లు, జీర్ణక్రియ కోసం పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తంలో కొవ్వు పరిమాణం పెరిగితే గుండె, ప్రాసారణ వ్యాధుల ముప్పుకు కారణమవుతుంది.
 
కొవ్వులు రెండు రకాలు. తక్కువ సాంద్రత లిపోప్రొటీస్ కొలెస్ట్రాల్, అధిక సాంద్రత లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొట్రీన్‌‌లు ధమనుల గోడల్లో చెడు కొవ్వులను నిల్వ చేసి గుండె జబ్బులకు కారణమవుతాయి. ఇది ఎంత తక్కువ పరిమాణంలో ఉంటే అంత మంచిది. గుండె సంబంధ ముప్పు కూడా తగ్గుతుంది. అధిక సాంద్రత కలిగిన లిపొప్రొట్రీన్‌లు గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇవి చెడు కొవ్వులను రక్తం నుంచి బయటకు పంపి ధమనుల్లో పేరుకు పోకుండా చూస్తాయి.
 
రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది. అసలు చెడు కొవ్వు శరీరంలోకి చేరడానికి ఆహారపు అలవాట్లే కారణమట. జంక్ ఫుడ్స్, మధ్యపానం, ధూమపానం లాంటి వాటితో దీని పరిమాణం పెరుగుతుంది తప్ప గుడ్డులోని పచ్చసొన తీసుకుంటే కాదని తేలింది.
 
ముఖ్యమైన అమైనో ఆమ్లాల ప్రొఫైల్‌లో గుడ్డు మొదటి తరగతి ప్రొటీన్‌కు చెందింది. గుడ్డులోని పచ్చ సొనను తొలగిస్తే ముఖ్యమైన అమైనా అమ్లాలను కొల్పోతారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ఒకవేళ పచ్చసొన తొలగిస్తే కేవలం 3 గ్రాములే మిగిలి ఉంటాయి. గుడ్డులో అనే పోషకాలు ఉన్నాయి. పచ్చసొన తొలగిస్తే ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డిలకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు.
 
వ్యక్తుల వారి జీవనశైలికి అనుగుణంగా వీటిని తీసుకోవాలి. ఎలాంటి శారీరక శ్రమలేని వ్యక్తులు రోజుకు 2 గుడ్లు తీసుకోవచ్చు. అలాగే అధిక శ్రమ చేసేవారు 4 నుంచి 5 గుడ్లను తీసుకోవచ్చు. మదుమేహం ఉంటే తప్ప.. రోజూ గుడ్డును, దాని సొననూ లాగించేయవచ్చు
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments