Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే?

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (20:39 IST)
జామకాయలు ఎలాంటి వాటిని తినాలి అన్నదానిపై చాలామందికి అవగాహన ఉండదు. మరీ పచ్చిగా ఉన్న జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి. వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. అదేవిధంగా ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్( 24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల దోరగా పండిన జామ పండును గానీ, లేదంటే గింజలు తక్కువ ఉన్న జామకాయను కానీ తినాలి.
 
ఇక జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. దంతాలు, చిగుళ్లనుంచి రక్తం కారేవారు జామకాయను కొరికి, బాగా నమిలి చప్పరించి ఆ పిప్పిని ఊసేయాలి. ఇలా చేయటం వల్ల రక్తం కారటం ఆగిపోవటమేకాదు దంతాలకు మేలు కలుగుతుంది. 
 
గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు పండిన జామగుజ్జుతో తేనె, పాలు కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు సౌందర్యానికి జామ ఎంతో ఉపయోగపడుతుంది. జామ ఆకులను మెత్తగా నూరి ముఖంమీద వచ్చే మొటిమలకు రాసినట్లయితే అవి తగ్గిపోతాయి. తరచుగా జలుబుతో బాధపడేవారు పండిన జామపండులో ఓ 5 గ్రాముల జామచెట్టు బెరడును కలిపి సేవిస్తే సమస్యనుంచి బయట పడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

తర్వాతి కథనం
Show comments