Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు ఇడ్లీలు కప్పు సాంబారులో మిక్స్ చేసి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (17:13 IST)
చెన్నై సంప్రదాయ అల్పాహారంలో ఎన్నో పోషక విలువులున్నాయని అధ్యయనాలు తేల్చాయి. రెండు ఇడ్లీలు కప్పు సాంబారులో మిక్స్ చేసి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇడ్లీ-సాంబారులో కార్పొహైడ్రేట్స్, ఎనర్జీ, ప్రోటీన్స్, ఫ్యాట్స్, క్యాల్షియం వంటివి ఇందులో లభిస్తాయి. రెండు ఇడ్లీలు సాంబారుతో  ఒక కాఫీ కూడా జతచేస్తే ఇంకా సూపర్.
 
చెన్నై సంపద్రాయ అల్పాహారం మిగతా మెట్రో నగర వాసుల అల్పాహారం కంటే పోషకసహితమని 'భారతీయుల అల్పాహార అలవాట్లపై అధ్యయనం' వెల్లడించింది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కత నాలుగు మెట్రోలలో 3,600 మందిపై నమూనా సర్వేగా దీనిని నిర్వహించారు. 
 
కోల్ కతా సంప్రదాయ అల్పాహారం ఎక్కువగా మైదాతో ఉంటుందట. దీనివల్ల కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నా, ప్రొటీన్ తక్కువని, ఫైబర్ అసలే ఉండదని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఢిల్లీ పరాటాలలో నూనె మరీ ఎక్కువని, ముంబై వాసులు ఎక్కువగా బ్రెడ్ తింటుంటారు. వీటిలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయన్నారు. 
 
ఇక ఇడ్లీ సాంబార్ విషయానికి వస్తే వీటిల్లో బియ్యం, మినప్పప్పు ఉండడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుందని, సాంబార్‌లో పప్పు, కూరగాయల ముక్కలు అన్నీ కలిపి ఆరోగ్యానికి పోషకరక్షణగా ఉంటాయని అధ్యయనకారులు తెలిపారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments