Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాప్య ఛాయలు తొంగిచూస్తున్నాయా? రోజూ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి..

30 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య ఛాయలు తొంగిచూస్తున్నాయా? అయితే పౌష్టికాహారంపై దృష్టి పెట్టండి. వయసు మీద పడకుండా ఉండాలంటే? చిన్నతనంలోనే వయసు పెద్దగా కనిపించకుండా ఉండాలంటే.. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (13:26 IST)
30 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య ఛాయలు తొంగిచూస్తున్నాయా? అయితే పౌష్టికాహారంపై దృష్టి పెట్టండి. వయసు మీద పడకుండా ఉండాలంటే? చిన్నతనంలోనే వయసు పెద్దగా కనిపించకుండా ఉండాలంటే.. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ వారి డైట్‌లో డ్రైఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఎండబెట్టిన ఆప్రికాట్లు, ఖర్జూరం, ఎండబెట్టిన రేగుపళ్లు ఈస్ట్రోజన్‌ హార్మోన్లను పెంచుతాయి. మిగిలిన డ్రైఫ్య్రూట్స్‌లో కూడా ఫైటోఈస్ట్రోజన్‌ ఉంటుంది. 
 
అలాగే ఈస్ట్రోజన్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాల్లో సోయా కూడా ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ అసలు ఉండదు. ప్రోటీన్లూ ఎక్కువే. ఇవి రెగ్యులర్‌గా ఆహారంలో తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ కూడా దరిచేరదు. అలాగే వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. అలాగే మొలకెత్తిన పెసలు, శెనగలు తీసుకోవడం ద్వారా హార్మోన్లను బ్యాలెన్స్‌ చేయడానికి వాడే మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఇవి నిరోధిస్తాయి.
 
ఇకపోతే.. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వీటిలో అధికంగా ఉండే ఈస్ట్రోజన్‌ హార్మోన్లు.. చిన్నతనంలో వచ్చే మెనోపాజ్‌ను దరిచేరకుండా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments