Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ పండిందో లేదో? పచ్చి పైనాపిల్ రసాన్ని తీసుకుంటే...

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (21:40 IST)
అనాసతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. తాజా అనాసను ఎంచుకునే ముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. పైన ఆకుపచ్చని రంగులో ఆకుల గుత్తి ఉండాలి. ఇది గోధుమ రంగులోకి మారకూడదు. పండును చేతితో పట్టుకుని చూస్తే బరువుగా అనిపించాలి. తోలు ముదురు ఆకుపచ్చ, ఎరుపు, పసుపులు కలిసిన మిశ్రమ వర్ణంలో ఉండాలి. తోలుపైన గాట్లు, దెబ్బలూ లేని దానిని చూసి ఎంచుకోవాలి. 
 
పండు చక్కని తీయని వాసన వెదజల్లాలి. అనాస పక్వానికి వచ్చిందీ లేనిదీ తెలుసుకోవటానికి ఒక తేలికపాటి పద్ధతి ఉంది. పండు కింద భాగంలో ఉండే ఆకుల్లో ఒకదానిని లాగి చూడాలి. తేలిగ్గా ఊడి వచ్చేస్తే పండు పక్వానికి వచ్చినట్లు అర్థం.
 
తాజా అనాసను సాధారణ వాతావరణంలో 1-2 రోజుల వరకూ చెడిపోకుండా ఉంచవచ్చు. రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ సంచిలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 4-6 రోజుల వరకూ తాజాగా ఉంటుంది. ముక్కలను ఎయిర్‌టైట్ పాత్రలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచితే 2-3 రోజుల వరకూ నిల్వ ఉంటాయి. అయితే ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి గడ్డ కట్టిస్తే సహజమైన సుగంధాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
 
పచ్చి అనాస కాయ రసానికి రక్తస్రావాన్ని నిలువరించే గుణం ఉంది కనుక అప్పుడే తగిలిన గాయాల మీద, కోసుకుపోయిన దెబ్బల మీద ప్రయోగించవచ్చు. బాగా మిగల పండిన అనాస పండు రసం శరీరపు వేడిని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన పోషక తత్వాలను అందిస్తుంది. దీనిలో ‘బ్రోమిలిన్’ అనే అతి శక్తివంతమైన ఎంజైము ఉంటుంది. ఇది ఆహార పచనానికి సహాయపడుతుంది. ఆహారంలో ప్రొటీన్‌ని విడకొట్టి అరుగుదలకు సహాయపడుతుంది.
 
పండులో అధిక మొత్తాల్లో పీచు పదార్థం కూడా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్యతో ఇబ్బందిపడేవారు దీన్ని తీసుకోవచ్చు. దీనిలో సహజంగా అధిక మొత్తాల్లో విటమిన్-సి, పొటాషియం వంటివి ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్-సి సహాయపడితే, మూత్రంలో మంటను తగ్గించి మూత్రాన్ని జారీ చేయడానికి అనాసలో వుండే పొటాషియం సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

తర్వాతి కథనం
Show comments