పది రోజుల్లో బరువు పెరగాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి...

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:27 IST)
సమాజంలో అధిక బరువుతో బాధపడేవారేకాక సరైన పోషక విలువలు అందక శక్తిహీనతతో బాధపడేవారు కూడా ఉన్నారు. శరీర బరువు పెంచుకోవడానికి తగిన ఆహార పద్ధతులను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. మీ శరీర రకాన్ని బట్టి మీరు ఏమి తీసుకోవాలో నిర్ణయించబడుతుంది. త్వరగా బరువు పెరగాలనుకునే వారు, దాదాపు 10 రోజుల్లో పెరగాలనుకునే వారు కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది. 
 
ఇది మీకు ఒక సవాలులాంటిది. నిష్టతో ఆచరిస్తే మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. పోషకాలు, క్యాలరీలు ఎక్కువగా కలిగి ఉండే ఆహారాలు, సాచురేటేడ్ కొవ్వు, చక్కెరలు తక్కువగా గల ఆహార పదార్థాలు తీసుకోవాలి. మీగడ తీసిన పాలు, నట్స్, నట్స్ బటర్, హోల్ గ్రైన్స్, బంగాళదుంప వంటి పిండి పదార్థాలు గల కూరగాయలు, అరటిపండు, వీటితోపాటు అధిక క్యాలరీలను మరియు పోషకాలను కలిగి ఉండే బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. 
 
పది రోజులలో శరీర బరువు పెరగాలి అనుకుంటే, రోజు తినే ఆహార ప్రణాళికలో కనీసం 500 క్యాలరీలను అధికంగా కలుపుకోవాలి. తీసుకునే భోజన పరిమాణాన్ని పెంచండి లేదా రెట్టింపు చేస్తే మరీ మంచిది. తినే ఆహారం క్యాలరీలు అధికంగా ఉండేవి అయ్యుండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్‌లు సమృద్ధిగా గల ఆహారాన్ని తీసుకోవాలి. 
 
పడుకునే ముందు అధిక క్యాలరీలు గల పదార్ధాలను తినడం వలన కూడా బరువు పెరగవచ్చు. సహజ పండ్ల రసాలను, తేనె, కొవ్వు తక్కువగా గల పాలు, ప్రొటీన్ షేక్స్, శక్తిని అందించే ద్రావణాలు వంటి వాటిని కూడా తాగాలి. చక్కెర గల టీలు, చక్కెరలు గల మిల్క్ షేక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. భుజాలపై ఒత్తిడి పెంచే వ్యాయామాలు, స్క్వాట్స్, డిప్స్, లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ మొదలుగునవి రోజు అనుసరించటం వలన శరీర బరువు పెరగటంలో సహాయపడతాయని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

తర్వాతి కథనం
Show comments