Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండ్లను కొంటున్నారా? రసాయనాలతో జాగ్రత్త

మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడి పండ్లను రోజూ కొనుక్కొచ్చి తెగ లాగించేస్తుంటారు.. చాలామంది. అయితే మామిడి పండ్లను కొనేముందు వాటిలోని రసాయనాలతో జాగ్రత్త అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (12:03 IST)
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్లలో మామిడి పండ్లను రోజూ కొనుక్కొచ్చి తెగ లాగించేస్తుంటారు.. చాలామంది. అయితే మామిడి పండ్లను కొనేముందు వాటిలోని రసాయనాలతో జాగ్రత్త అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వేసవి కావడంతో మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు కార్బైడ్ లాంటి విష రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల కేన్సర్ వ్యాధి తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అందుకే పండ్లను తినేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పంటకు రావడం అనేది పండ్లలో జరిగే ఒక సహజ ప్రక్రియ. కానీ డిమాండ్ అధికం కావడంతో మామిడి కాయలను పండేలా చేసేందుకు రసాయనాలు ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిండి పదార్థాలు చక్కెరగా మారే అవకాశాలున్నాయి. పండ్లు పంటకు రావటమంటే మంచి రుచిని సువాసనను సంతరించుకుంటుంది. 
 
తరువాత వాటి రంగు మారుతుంది. కేవలం మామిడి పళ్లతోనే మాత్రమే కాదు.. వేసవికాలంలో చాలారకాల పండ్లలో కార్బైడ్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. సహజసిద్ధంగా పండే పండ్లను తింటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వుండదు కానీ.. రసాయనాలను కలిపిన పండ్లను తింటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రంగును చూసి మోసపోకుండా.. కాయను సున్నితంగా నొక్కి తొడిమల దగ్గర మంచి వాసన వస్తుందా అని చూడండి. సహజంగా పండిన మామిడిపండ్లు నీటిలో మునుగుతాయి. అదే కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను నీరున్న బకెట్లో వేస్తే పైకి తేలుతాయి. రసాయనాలతో పండించిన పండ్లను తింటే చర్మంపై దురద, కడుపులో మంట, అజీర్తిలాంటి ఇబ్బందులుంటాయి.
 
అందుకే వాటిని నీటిలో శుభ్రంగా కడిగితే కొంతవరకు రసాయనాలను పోగొట్టుకోవచ్చు. అలాగే వెనిగర్‌ను పండ్లపైన స్ప్రే చేసి, ఐదు నిమిషాలు మంచినీళ్లలో శుభ్రంగా కడిగి తింటే ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments