Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరింటాకు ఎర్రగా పండాలంటే... అరికాళ్లల్లో పెట్టుకుంటే..?

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (20:11 IST)
గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రసాయనాలతో చేసిన కోన్ జోలికి పోవద్దు. ఆకుని తెంపుకుని మెత్తగా నూరుకుని.. అందులో చక్కెర, రెండు లవంగాలు వేయండి. గిన్నెలోకి తీసుకున్నాక ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్‌ని కలిపి పక్కన పెట్టండి. ఓ అరగంట గడిచాక గోరింటాకుని చేతులకు పెట్టుకోవాలి. 
 
కనీసం నాలుగైదు గంటలైనా ఉంచుకోగలిగితే చక్కటి రంగు వస్తుంది. గోరింటాకు ఎండిపోతే చక్కెర నిమ్మరసం కలిపిన సిరప్‌లో ముంచిన దూదితో అద్దండి. గోరింటాకు తేసేశాక లవంగ నూనెను చేతికి రాసుకుంటే చక్కటి రంగులోకి వస్తుంది. 
 
గోరింటాకుకి వేడిని తగ్గించే గుణం ఉంది. అందుకే అధిక వేడితో ఇబ్బందిపడేవారు అరికాళ్లల్లో దీన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. మానసిక ఒత్తిడి దరిచేరనివ్వదట గోరింటాకు, నువ్వుల నూనెలో, గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే జుట్టు ఎదుగుతుంది. తెల్ల వెంట్రుకలు త్వరగా రావని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments