Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజువారి భోజనం ఎలా చేయాలంటే..?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (16:11 IST)
కొందరైతే ఎప్పుడు చూసిన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అందుకోసం ఏవేవో మందులు, మాత్రలు వాడుతుంటారు. వీటి వాడకం కంటే ఈ పద్ధతులు పాటిస్తే చాలంటున్నారు నిపుణులు. అవేంటో ఓసారి తెలుసుకుందాం..
 
1. ప్రతి రోజు పండ్లను సేవించాలి. కనీసం రోజుకు ఒక పండునైనా ఆహారంగా తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే ముందు తప్పనిసరిగా సలాడ్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
2. మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోండి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. 
 
3. ఒకేసారి ఎక్కువగాను లేదా మరీ తక్కువగాను ఆహారాన్ని భుజించకూడదు. సమపాళ్ళల్లోనున్న ఆహారాన్ని భుజించాలి. రాత్రిపూట మీరు తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అప్పుడే అది జీర్ణమవుతుంది.
 
4. వంటకాల్లో ఉప్పు తక్కువగా ఉపయోగించాలి. గోధుమ పిండిని జల్లెడ పట్టకుండా రొట్టెలు చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోనున్న పీచు పదార్థం శరీరానికి చాలా మంచిది.  
 
5. వీలైనంత మేరకు ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. వయసు పెరిగేకొద్దీ ఆహార నియమాలను పాటించాలి. వీలైనంత తక్కువగా ఆహారాన్ని సేవించేందుకు ప్రయత్నించాలి. మీరు తీసుకునే ఆహారంలో పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లోనున్న కూరగాయలను తప్పక తినాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments